ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dreams: నిద్రలోంచి లేచిన మరుక్షణమే.. వచ్చిన కల ఏంటో కూడా గుర్తుకు రాదు.. అసలెందుకు అలా మర్చిపోతారంటే..!

ABN, First Publish Date - 2023-10-17T13:37:31+05:30

కొందరికి తాము కన్న కలలు చక్కగా గుర్తుంటాయి. కానీ మరికొందరికి మాత్రం నిద్రనుండి మెల్కొనగానే అసలు తమకు రాత్రి వచ్చిన కల ఏంటి? కలలో ఏం జరిగింది? వంటి విషయాలు ఏమీ గుర్తుండవు. దానికి కారణాలు ఇవే..

నిద్రించే ప్రతి ప్రాణి కలలు కంటుంది. కానీ మనిషి మాత్రమే తనకు వచ్చిన కలల గురించి చెప్పగలుగుతాడు. నిద్రచక్రం వేగంగా ఉన్నప్పుడు కలలు కనడం జరుగుతుంది. మనిషిలో అంతర్లీనంగా ఉన్న కోరికలు, ఆలోచనలు, మనిషి మీద ఉన్న ప్రభావాలు మొదలైనవి కలల రూపంలో వస్తాయని ఆస్ట్రియన్ న్యూరాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పారు. ఆశ్ఛర్యం ఏమిటంటే కొందరికి తాము కన్న కలలు చక్కగా గుర్తుంటాయి. కానీ మరికొందరికి మాత్రం నిద్రనుండి మెల్కొనగానే అసలు తమకు రాత్రి వచ్చిన కల ఏంటి? కలలో ఏం జరిగింది? వంటి విషయాలు ఏమీ గుర్తుండవు. ఎంత ఆలోచించినా అస్సలు గుర్తురావు కూడా. ఇలా కలలు గుర్తుండకపోవడానికి 5కారణాలు ఉన్నాయని కలల మీద పరిశోధనలు చేసేవారు అంటున్నారు. ఆ కారణాలు ఏంటో తెలుసుకుంటే..

కలలు కనే స్థితిలో మనస్సు చాలా చురుగ్గా ఉంటుంది. కానీ వాస్తవంలోకి వచ్చే సరికి చుట్టూ ఉన్న విషయాలు కలల గురించి ఆలోచించనివ్వకుండా చేస్తాయి. చేతిమీద వాలిన సీతాకోకచిలుకను పట్టుకోవడం, కలలను గుర్తుచేసుకోవడం రెండూ ఒకటేనట. సీతాకోకచిలుక ఎగిరిపోతే ఎలాగేతై మళ్ళీ పట్టుకోలేమో.. కలలను కూడా వెంటనే గుర్తుతెచ్చుకోకపోతే అవి మళ్లీ గుర్తురావు.

Recurring Dreams: కొందరికి పదే పదే ఒకే రకమైన కల.. అసలు ఎందుకు అలా రిపీట్ అవుతుందో తెలిస్తే..!



వాస్తవజీవితంలో ఏ విషయాలను అయినా గుర్తుంచుకున్నంత బాగా కలలను గుర్తుంచుకోలేం. దీనికి కారణం కలలు అస్థిరమైనవి, వీటి వేగం ఎక్కువ. ఇవి చాలా తక్కువ జ్ఞాపకశక్తితో నిల్వచేయబడతాయి. ఈ కారణంగా ఇవి గుర్తుండవు.

కలలలో చాలావరకు తీవ్రమైన భావోద్వేగాలు, కలవరపెట్టే దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి గుర్తురావడం వాస్తవ జీవితంలో మనిషిని డిస్టర్బ్ చేస్తుంది. ఇలా కలలు మెదడు నిక్షిప్తం కాకుండా ఉండే వ్యవస్థను మెదడే ఏర్పాటుచేస్తుంది.

కలలు చాలావరకు చిందరవందరగా ఉంటాయి. వాస్తవ జీవితంలో సంఘటనల్లానూ, కథలలో సీన్లలానూ ఒక క్రమ పద్దతిలో అవి ఉండవు. చిందరవందరగా వచ్చిన ఆ కలలు అనాసక్తిగా ఉంటాయి. ఇది కలలు గుర్తుండకపోవడానికి ఒక కారణం అవుతుంది.

కలలు హేతుబద్దంగా లేకపోవడం కూడా అవి గుర్తుండకపోవడానికి కారణం. వాస్తవ పరిస్థితులకు, జీవితానికి భిన్నంగా, వింతగా అనిపించడం వల్ల కలలను చాలామంది కొట్టిపడేస్తుంటారు.

Milk tea or Black tea: బ్లాక్ టీ బెస్టా..? పాలతో చేసిన టీ మంచిదా..? రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!


Updated Date - 2023-10-17T13:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising