Drishyam: అంతర్జాతీయ భాషల్లోకి ‘దృశ్యం’ ప్రాంచైజీ
ABN, First Publish Date - 2023-02-08T18:43:22+05:30
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ప్రాంచైజీ ‘దృశ్యం’ (Drishyam). రెండు భాగాలుగా ప్రేక్షకులుగా ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ప్రాంచైజీ ‘దృశ్యం’ (Drishyam). రెండు భాగాలుగా ప్రేక్షకులుగా ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. భారీ స్థాయి వసూళ్లను రాబట్టాయి. ఈ ప్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా మంచి పాపులారిటీ ఉంది. అందువల్ల పలు అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాలను నిర్మించనున్నారు.
‘దృశ్యం’ సినిమాలు ఇండియాలోని అనేక భాషల్లో రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతి చోట కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. అందువల్ల ఇంగ్లిష్‌తో సహా ఇతర భాషల్లోను ఈ చిత్రాలను నిర్మించనున్నారు. ఈ రెండు మూవీస్‌కు సంబంధించిన రైట్స్ పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వద్ద ఉన్నాయి. కొరియా, జపాన్, హాలీవుడ్‌కు చెందిన పలు కంపెనీలతో ఈ నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతుంది. ఆయా భాషల్లో నిర్మించాలని సమాలోచనలు జరుపుతుంది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘హిందీలో ‘దృశ్యం 2’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందువల్ల పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాల రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌తో సహా ఇతర విదేశీ భాషల హక్కులను సొంతం చేసుకుంది’’ అని పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఓ ప్రకటనను జారీ చేసింది. విదేశీ భాషల నుంచి పిలిఫినో, సింహళ, ఇండోనేసియన్ భాషల హక్కులను మినహాయించినట్టు ఆ సంస్థ పేర్కొంది.
‘దృశ్యం’ లో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించారు. మీనా, ఎస్తేర్ అనిల్, హన్సిబా హాసన్, ఆశా శరత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. రెండో భాగం కూడా మొదటి దానిని మించి రాణించింది. అందువల్ల ‘దృశ్యం’ ప్రాంచైజీని అంతర్జాతీయ భాషల్లో నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
Updated Date - 2023-02-08T20:42:11+05:30 IST