Mumbai: 17 ఏళ్ల పాటు నమ్మకంగా పనిచేసిన డ్రైవర్ ఒడిగట్టిన దారుణమిది! ఓనర్ ఆ సీక్రెట్ చెప్పగానే..
ABN, First Publish Date - 2023-10-22T15:54:39+05:30
డబ్బుపై ఆశ ఎంతటి వారితోనైనా పాడు పనులు చేయిస్తుంది. నోట్ల కట్టలు కళ్ల చూస్తే మనసు చెలిస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉదాహరణ ముంబైలో ఇటీవలే వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: డబ్బుపై ఆశ ఎంతటి వారితోనైనా పాడు పనులు చేయిస్తుంది. నోట్ల కట్టలు కళ్ల చూస్తే మనసు చెలిస్తుంది. అప్పటివరకూ సంపాదించుకున్న గుర్తింపు, నమ్మకం, పణంగా పెట్టి మరీ తప్పటడుగు వేసేందుకు పురి గొల్పుతుంది. ఇందుకు తాజాగా ఉదాహరణ ముంబైలో వెలుగు చూసింది. తన వద్ద 17 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌పై నమ్మకంతో ఓ బిల్డర్ కారులో ఏముందో చెప్పి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కారు వదిలి ఎక్కడికీ వెళ్లొద్దన్నాడు. దీంతో, ఆ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు(Driver of 17 years flees with employer’s car and Rs 1 crore in Mumbai).
H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!
Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..
అక్టోబర్ 11న జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే, ముంబైకి(Mumbai) చెందిన ఓ బిల్డర్ వద్ద సంతోష్ చవాన్ గత 17 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ రోజు ఆ బిల్డర్ తన కారు డిక్కీలో రూ.25 లక్షలు పెట్టుకుని ప్రభుత్వాఫీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో కారులో దాచి ఉంచిన రూ.25 లక్షల గురించి డ్రైవర్‌కు చెప్పాడు. డబ్బు జాగ్రత్తగా చూసుకోమని, కారును విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని సూచించి ఆఫీసు లోపలికి వెళ్లాడు. ఆ తరువాత బిల్డర్ బయటకు వచ్చి చేసే సరికి చవాన్.. కారు, అందులోని డబ్బు తీసుకుని పారిపోయాడు.
Viral: మొబైల్ షాపు యజమానికి భారీ షాక్..ఆ రాత్రి షాపులో ఏం జరిగిందో సీసీటీవీ కెమెరాలో చూసి..
తొలుత చవాన్ బిల్డర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ నుంచి మరో రూ.75 లక్షలను కాజేశాడు. సీసీకెమెరాలు లేని ప్రాంతాల్లోనే కార్లను మార్చుతూ ఎవరి కంటికీ చిక్కకుండా తప్పించుకుని పారిపోయాడు. ఈ క్రమంలో తన బంధువు సాయంతో ఓ సిమ్ కార్డు కొనుగోలు చేయడమే చేసి, అతడి గుర్తింపు కార్డుతో ఓ గెస్ట్ హౌస్‌లో దిగాడు. అక్కడ సంతోష్ తన వద్ద ఉన్న 50 లక్షలను బంధువుకు ఇచ్చి మిగతా డబ్బుతో అకోలాకు పారిపోయాడు. ఈలోపు బిల్డర్ ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడి జాడను కనిపెట్టి అరెస్టు చేశారు. నిందితుడు దొంగిలించిన డబ్బులో చాలా మొత్తాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!
Updated Date - 2023-10-22T16:07:49+05:30 IST