ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Inamdar: సమంత 'వూ అంటావా మావా' పాటలా ఎస్తర్ పాట కూడా వైరల్

ABN, First Publish Date - 2023-02-11T14:20:56+05:30

'ఇనాందార్' సినిమాలో ఒక గ్లామర్ తో కూడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. సమంత (Samatha) నటించిన ఐటెం సాంగ్ 'వూ అంటావా మావా' (Voo Antava Mava) పాట లా ఈ ఎస్తర్ (Ester) 'సిల్క్ మిల్క్' (#SilkMilkSong) పాట కూడా బాగా వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ సినిమాలు ఈమధ్య మంచి పేరు సంపాదిస్తున్నాయి. ఇప్పుడు ఇంకో కన్నడ సినిమా 'ఇనాందార్' (Inamdar) విడుదలకి సిద్ధంగా వుంది. ఇది కూడా 'కాంతారా' (#Kantara) సినిమాలా పీరియడ్ డ్రామా, అలాగే లోకల్ నేటివిటీ తో తీసిన సినిమా. 'కాంతారా' సినిమాకి శెట్టి లు ఎలా పని చేసారో ఈ 'ఇనాందార్' సినిమాకి కూడా శెట్టి లు పని చేశారు. రిషబ్ శెట్టి (Rishabh Shetty) ఎలా దర్శకత్వం, నటించడం చేసాడో, ఈ సినిమాకి కూడా సందేశ్ శెట్టి (Sandesh Shetty) ఈ దర్శకుడు అలాగే నటించాడు కూడా.

ఈ సినిమాకి నిరంజన్ శెట్టి (Niranjan Shetty) నిర్మాత. 'కాంతారా' లో వేసిన ప్రమోద్ శెట్టి (Pramod Shetty) అనే అతను ఈ 'ఇనాందార్' (#Inamdar) లో కూడా నటించాడు. ఈ సినిమాలో ఒక గ్లామర్ తో కూడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. సమంత (Samatha) నటించిన ఐటెం సాంగ్ 'వూ అంటావా మావా' (Voo Antava Mava) పాట లా ఈ ఎస్తర్ (Ester Noronha) 'సిల్క్ మిల్క్' (#SilkMilkSong) పాట కూడా బాగా వైరల్ అవుతోంది.

ఈ పాటలో కన్నడ, తెలుగులో బాగా పాపులర్ అయినా ఎస్తర్ (Ester) నటించింది. అలాగే రంజన్ ఛత్రపతి కూడా ఈ పాటలో కనపడతాడు. ఈ కన్నడ పాట ఇప్పటికే బాగా వైరల్ అయింది. "ఈ సినిమాలో నా గురించి (Introduction song) చెప్పే సాంగ్. ఐటెం సాంగ్ లా కనిపిస్తోంది కానీ, సినిమాలో అలా కాదు. సినిమాలో నేను 80వ దశకం లో ఒక పెద్ద స్టార్ ని, నా పేరు సిల్క్ (Silk). నేను ఒక్క చిన్న వూర్లో డ్రామా ఆడటానికి వస్తాను. ఆ డ్రామా కంపెనీ ఓనర్ నన్ను తీసుకు వస్తాడు, వాళ్లేదో డ్రామా వేస్తె, ప్రజలు తిరస్కరిస్తే, అప్పుడు నన్ను దించుతారు, అదీ ఆ పాట," అని చెప్పింది ఎస్తర్ ఆ పాటగురించి.

ఇందులో ఎస్తర్ లుక్, గెట్ అప్, స్టైల్ అన్నీ 80 వ దశకం లో ఎలా ఉంటుంది అలానే ఉండేట్టు చేశారు. అందుకనే ఎస్తర్ ఈ రోల్ చెయ్యడానికి ఒప్పుకుంది అని చెప్పింది. ఈ 'ఇనాందార్' లో అలానే కనపడుతుంది ఆమె. పాత కాలం నటీమణి లా ఒక పాత్ర చెయ్యడానికి అవకాశం వచ్చింది అని చేసింది ఈ పాత్ర అని చెప్పింది ఎస్తర్.

"పాట ఎలా ఉంటుందో, ఎలా అందరూ రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం బెరుకు వుండింది. కానీ పాట విడుదల అయ్యాక, చాలామంది మెసేజీలు, ఫోన్ చేసి చాలా బాగుంది, లుక్ ఇంకా బాగుంది అని చెప్పేసరికి చాలా సంతోషం వేసింది," అని చెప్పింది ఎస్తర్. ఈ సినిమా మార్చి నెలలో విడుదల అవొచ్చు అని అనుకుంటున్నారు.

Updated Date - 2023-02-11T14:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising