ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Face Wash: ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు.. ఈ ఒక్కటీ ఉపయోగించి ముఖం కడుక్కుంటే చందమామలా మారడం ఖాయం..

ABN, First Publish Date - 2023-05-21T18:09:01+05:30

ముఖం మీద దుమ్ము, ధూళి, జిడ్డు, మొటిమలు, మచ్చలు, ముడుతలు ఇలా ఎన్నో అమ్మాయిలను ఇబ్బంది పెడుతుంటాయి. ఫేస్ వాష్ ద్వారా ఇవి తొలగిపోతాయని, ఫేస్ వాష్ ల కోసం ఎంత ఖర్చు చెయ్యడానికి అయినా వెనుకాడరు. . అయితే ఫ్రిడ్జ్ లో ఎప్పుడూ స్టాక్ ఉండే దీంతో పేస్ వాష్ చేసుకుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ కాలం అమ్మాయిలు ముఖం కడుక్కోడానికి ఎక్కువగా ఫేస్ వాష్ వాడుతారు. ముఖం మీద దుమ్ము, ధూళి, జిడ్డు, మొటిమలు, మచ్చలు, ముడుతలు ఇలా ఎన్నో అమ్మాయిలను ఇబ్బంది పెడుతుంటాయి. ఫేస్ వాష్ ద్వారా ఇవి తొలగిపోతాయని, ఫేస్ వాష్ ల కోసం ఎంత ఖర్చు చెయ్యడానికి అయినా వెనుకాడరు. . అయితే ఎన్ని ఫేస్ వాష్ లు వాడినా ఆశించిన ఫలితం ఉండదు. చందమామ లాంటి ముఖ సౌందర్యం సొంతం కావాలంటే ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు. మీ ఫ్రిజ్ లో ఎప్పుడూ స్టాక్ ఉండే పాలు(Milk) చాలు. పాలతో ఫేస్ వాషా అని ఆశ్చర్యం వేస్తుందేమో కానీ దీని వల్ల మ్యాజిక్ రిజల్ట్ ఉంటుందండీ బాబూ.. పాలలో విటమిన్ ఎ,డి(Vitamin A,D) పుష్కలంగా ఉంటాయి. అలాగే లాక్టిక్ యాసిడ్(lactic acid) అధికంగా ఉంటుంది. పాలతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ముఖం మెరుపును సంతరించుకుంటుంది. పేస్ వాష్ చేసుకోవడానికి పాలను(Milk for face wash) ఎలా ఉపయోగించాలి? ఎలా ఉపయోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటే..

వేసవి కాలంలో(Summer) అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య మొటిమలు(Pimples), టానింగ్(tanning). ఎండ ప్రభావం వల్ల ముఖం మీద టాన్ పేరుకుని పోయి చర్మం రంగు(skin colour changed with tan) మారుతుంది. అయితే ఎండ నుండి ఇంటికి రాగానే పాలతో ముఖం కడుక్కోవడం(face wash with milk) లేదా పాలలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవడం ఆ తరువాత నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం మీద టానింగ్ తగ్గిపోతుంది.

చర్మంమీద మురికి(dirt), మృతకణాలు(dead cells) తొలగించుకోవడానికి పాలతో ఫేస్ వాష్ అద్బుతంగా పనిచేస్తుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ నూనెలో కరిగే మురికిని కూడా తొలగించగలదు. ఒక చిన్న కప్పులో పాలు తీసుకుని కొద్దిగా అరచేతిలో వేసుకుని మెల్లిగా ముఖం కడుక్కోవాలి. పాలతో ముఖం కడుక్కున్న తరువాత మళ్ళీ నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. తరువాత మెత్తటి టవల్ తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా కుదరని పక్షంలో కాసిన్ని పాలల్లో కాటన్ బాల్ ముంచి ముఖమంతా పట్టించి ఆ తరువాత వాష్ చేసుకోవచ్చు. ముఖం మీద డెడ్ సెల్స్ కూడా ఈజీగా తొలగిపోతాయి.

Viral Video: బైక్ మీద వెళ్ళే టప్పుడు వెధవ్వేషాలు వెయ్యకూడదు అనేది ఇందుకే.. యమా జోష్ గా వెళుతున్న ఈ కుర్రాళ్ళకు ఏం జరిగిందో మీరే చూడండి..


చర్మం మీద ముడుతలు(wrinkles) ఉంటే గనుక పాలతో పేస్ వాష్ చేసుకోవడం చాలా మంచిది. పాలు ముఖానికి బెస్ట్ యాంటీ ఏజింగ్ గుణాలు( best anti aging compounds) అందించడంలో సహాయపడుతుంది. పాలతో ముఖం కడుక్కుంటే ముఖం మీద ముడుతలు తొలగించి ముఖం యవ్వనంగా, మెరుస్తూ కనిపించేలా చేస్తుంది.

పాలతో ముఖం కడుక్కున్నప్పుడు చర్మం మీద, చర్మ రంధ్రాలలో పేరుకున్న మురికి కరుగుతుంది. తరువాత మళ్ళీ సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కున్నప్పుడు ఈ మురికి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల ముఖం శుభ్రంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది.

Viral News: 16ఏళ్ళ వయసులో రెస్టారెంట్లో ప్లేట్లు కడిగే ఉద్యోగం.. రెండేళ్ళ తరువాత యజమానికి దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..


Updated Date - 2023-05-21T18:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising