Shocking: స్నేహితుడు కదా అని నమ్మితే దారుణం.. యువతిని గదిలో బంధించి పరారు.. అతడి ప్లాన్ ఏంటంటే..
ABN, First Publish Date - 2023-03-25T15:35:19+05:30
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తితో స్నేహం చేయడమే ఆ యువతిని కష్టాల పాలు చేసింది. అతడిని గుడ్డిగా నమ్మడమే ఆమె పొరపాటైంది.
ఫేస్‌బుక్ (Facebook) ద్వారా పరిచయమైన ఆ వ్యక్తితో స్నేహం చేయడమే ఆ యువతిని కష్టాల పాలు చేసింది. అతడిని గుడ్డిగా నమ్మడమే ఆమె పొరపాటైంది. పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌కు చెందిన ఓ 24 ఏళ్ల యువతికి కొన్ని రోజుల కిందట ఫేస్‌బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమెతో స్నేహం చేశాడు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది (Love With Facebook Friend).
ఇటీవల నేరుగా కలుద్దామని చెప్పి ఆ యువతిని యువకుడు పిలిచాడు. ఆమెను ఓ రెస్టారెంట్‌కి తీసుకెళ్లి జ్యూస్ తాగించాడు. జ్యూస్‌లో మత్తు మందు కలపడంతో ఆ యువతి కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, నిందితుడు ఆమెను కిడ్నాప్ చేసి హర్యానాకు తీసుకెళ్లాడు. ఓ గదిలో ఆమెను బందీగా ఉంచాడు. ఆమె అరుపులు కేకలు వేయడంతో ఆమెను కొట్టి, చేతులు కాళ్లు, కట్టేసి వెళ్లిపోయాడు. రెండ్రోజులు ఆమె భోజనం, నీళ్లు కూడా లేకుండా చీకటి గదిలో పడి ఉంది. ఆ తర్వాత నిందితుడు మళ్లీ అక్కడకు వెళ్లాడు.
Shocking: రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే ప్రేమికుల రొమాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..
ఆ యువతిని ఓ వ్యభిచార ముఠాకు అమ్మేందుకు ప్లాన్ చేశాడు. వారితో డీల్ కూడా కుదుర్చుకున్నాడు. ఆ సమయంలో యువతి వారి కళ్లు గప్పి తప్పించుకుంది. వారి నుంచి పారిపోయి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు (Crime News).
Shocking: ఎంత దారుణం.. తండ్రి పోలికలు వచ్చాయని మూడు నెలల కూతురిని చంపిన కన్న తల్లి..
Updated Date - 2023-03-25T15:35:19+05:30 IST