ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farzi web series review: దర్శకులు రాజ్&డీకే లకి మరో విజయం ఇది

ABN, First Publish Date - 2023-02-14T16:53:06+05:30

థియేటర్ లో సినిమాలు ఎలా శుక్రవారం అయ్యేసరికి విడుదల అవుతున్నాయో, వాటి కోసం ప్రేక్షకులు ఈ విధంగా ఎదురుచూస్తున్నతో అలాగే ఓ.టి.టి. లో కూడా కొత్త వెబ్ సిరీస్, సినిమాల కోసం టీవీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వాటికి కూడా ఆలా డిమాండ్ వుంది. ప్రముఖ హిందీ నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor) మొదటి సారిగా చేసిన వెబ్ సిరీస్ 'ఫర్జీ' (#Farzi) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో విడుదల అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెబ్ సిరీస్: ఫర్జీ

నటీనటులు: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్, రాశి ఖన్నా, అమోల్ పాలేకర్, భువన్ అరోరా, చిత్తరంజన్ గిరి, జాకిర్ హుస్సేన్ తదితరులు

ఛాయాగ్రహణం: పంకజ్ కుమార్

సంగీతం: కేతన్ సోదా, సచిన్ జిగర్, తనిష్క్ బాచి

దర్శకత్వం: రాజ్ & డీకే

నిర్మాతలు: రాజ్ & డీకే

విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో

-- సురేష్ కవిరాయని

థియేటర్ లో సినిమాలు ఎలా శుక్రవారం అయ్యేసరికి విడుదల అవుతున్నాయో, వాటి కోసం ప్రేక్షకులు ఈ విధంగా ఎదురుచూస్తున్నతో అలాగే ఓ.టి.టి. లో కూడా కొత్త వెబ్ సిరీస్, సినిమాల కోసం టీవీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వాటికి కూడా ఆలా డిమాండ్ వుంది. ప్రముఖ హిందీ నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor) మొదటి సారిగా చేసిన వెబ్ సిరీస్ 'ఫర్జీ' (#Farzi) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో విడుదల అయింది. 'ఫామిలీ మాన్' (Family Man) లాంటి ఒక హిట్ వెబ్ సిరీస్ దర్శకత్వం చేసి అందరిని ఆకర్షించిన రాజ్&డీకే (Raj&DK) ఈ 'ఫర్జీ' కి దర్శకులు, నిర్మాతలు కూడా. ఇందులో ఇంకా విజయ్ సేతుపతి (Vijay Sethupathi), కే కే మీనన్ (Kay Kay Menon), అమోల్ పాలేకర్ (Amol Palekar), రాశి ఖన్నా (Raashi Khanna) లాంటి పెద్ద పెద్ద నటులు వున్నారు. 'ఫర్జీ' అంటే నకిలీ, ఈ వెబ్ సిరీస్ నకిలీ నోట్లకు సంబందించినది (Counterfeit currency) అని వేరే చెప్పనక్కరలేదు. ఇదెలా ఉందొ చూద్దాం.

Farzi story ఫర్జీ కథ:

చిత్రపటాలు, క్యారికేచర్లు, బొమ్మలు బాగా వెయ్యగల దిట్ట సందీప్ అలియాస్ సన్నీ (షాహిద్ కపూర్) అనే యువకుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సన్నీ ని తాత మహాదేవ్ (అమోల్ పాలేకర్) చేరదీసి పెంచుతాడు. మహాదేవ్ స్వాతంత్ర సమార యోధుడు అలాగే, క్రాంతి అనే పత్రికని నడుపుతూ ఉంటాడు. విలువలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, అందులో పని చేసే కార్మికుల కోసం, పత్రిక కోసం చాలా అప్పులు చేస్తాడు. చివరికి అప్పులవాళ్ళు ఆ పత్రిక ఆఫీస్ ని స్వాధీనం చేసుకుంటాం అని చెప్తారు. అప్పుడు సన్నీ, అతనికి చాలా ఆప్తమిత్రుడు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయిన ఫిరోజ్ (భువన్ అరోరా) తో కలిసి అప్పులవాళ్ళని బతిమాలి కొంచెం టైం ఇవ్వండి అని చెప్తాడు. తాత బాధని చూడలేక ఏదైనా చేసి ఆ పత్రిక మీద వున్న అప్పులు తీర్చి, అందులో పనిచేసే కార్మికులకు మంచి జీతాలు ఇవ్వాలని సన్నీ అతని మిత్రుడు అలోచించి అదే పత్రిక ప్రింటింగ్ ప్రెస్ లో దొంగనోట్ల ముద్రణ చేస్తారు. సన్నీ మంచి చిత్రకారుడు అవటం వలన, ఫిరోజ్ రంగులను బాగా కలపడం లో దిట్ట అవటం వలన ఇద్దరు స్నేహితులు దొంగనోట్లను పట్టుబడకుండా చలామణీ చెయ్యటం లో సఫలీకృతులు అవుతారు.

మన్సూర్ దలాల్ (కే కే మీనన్) ఒక అంతర్జాతీయంగా దొంగనోట్లను చలామణీ చేస్తూ వుండే ఒక ముఠాకి నాయకుడు. అతను ఈ ఇద్దరు స్నేహితులను తన దగ్గరకు తీసుకొని భారతదేశం లో ఈ దొంగనోట్ల చలామణి (Counterfeit currency) కి ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. ఇంకో పక్క ఈ దొంగనోట్ల ముఠా నాయకుడు అయిన మన్సూర్ దలాల్ ని పట్టుకోవాలని మైకేల్ వేదనాయగం (విజయ్ సేతుపతి) ఒక టీం ని ఏర్పాటు చేసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. (Farzi review) అతని టీం లోనే మేఘ వ్యాస్ (రాశి ఖన్నా) కూడా పని చేస్తుంది. ఆమె దొంగ నోట్లను కనిపెట్టే ఒక చిన్న మెషిన్ ని కనిపెడుతుంది. ఇంతకీ మైకేల్ మన్సూర్ ని పెట్టుకున్నాడా? సన్నీ అతని స్నేహితుడు ఫిరోజ్ దొంగ నోట్ల ముద్రణలో మన్సూర్ తో కలిసారా, లేక ఆపేసారు? పట్టుకోవడానికి పోలీసులు అన్నింటా వాలా, దాన్ని తప్పించుకోవడానికి దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు ఏమి చేసారు, చివరికి ఏమైంది అనే విషయం తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. (Farzi review)

విశ్లేషణ:

'డబ్బుకి లోకం దాసోహం' అనే నానుడి వుంది కదా, అలానే డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు లేకపోతే అందరూ చులకనగా చూస్తారు అని మంచి వాడుగా వున్న ఒక యువకుడు చెడ్డ దారిలోకి ఎలా వచ్చాడు అన్న అతని కథే ఈ 'ఫర్జీ'. అక్కడితో ఆగిపోకుండా, అత్యాశకి పోయి ఎన్ని చిక్కుల్లో పడ్డాడు, చివరికి ఏమైంది అని చెపుతుంది ఈ వెబ్ సిరీస్. రాజ్& డీకే లు 'ఫామిలీ మాన్' (#FarziReview) అనే వెబ్ సిరీస్ తో మంచి విజయం సాధించారు, అలాగే పేరు కూడా సంపాదించారు. అది టెర్రరిజం నేపధ్యం అయితే, ఇది కూడా ఇంచు మించు అలాంటిదే, అయితే ఈసారి దొంగ నోట్ల గురించి, ఇది కూడా ఒక రకంగా టెర్రరిజమ్ అనే చెప్పాలి. దర్శకులు రాజ్ & డీకే లు ఈ దొంగ నోట్ల ముద్రణ, అవి ఎలా తాయారు చేస్తారు, మార్కెట్ లోకి ఎలా వస్తాయి, ఇవన్నీ బాగా రీసెర్చ్ చేసినట్టు కనపడింది. అందువల్ల మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు కూడా ఎక్కడ బోర్ లేకుండా అన్ని డీటెయిల్స్ తో బాగా చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ వాళ్ళిద్దరికీ ఇంకో పెద్ద విజయం అనే చెప్పాలి. (#FarziReview)

దానికితోడు పెద్ద పెద్ద నటుల్ని ఇందులో తీసుకోవటం ఈ వెబ్ సిరీస్ మరింత ఆసక్తికరం అయింది. షాహిద్ కపూర్ ని కథానాయకుడిగా తీసుకొని అతని పాత్రని మలిచిన తీరు చాలా బాగుంది. తన తాత నడిపిస్తున్న 'క్రాంతి' పత్రిక మూతపడకుండా తాతకి ఏదైనా చెయ్యాలన్న ఆలోచనతో తనకి బాగా నచ్చిన, వచ్చిన విద్యను చెడు దారికి మళ్లించే ప్రయత్నం ఎలా చేస్తాడు కథానాయకుడు అన్న విషయం బాగా చెప్పారు. కానీ ఆలోచన చేయాల్సింది ఒక్కటే, కథానాయకుడిని నెగటివ్ షేడ్ లో చూపించటం పరిపాటి అయిపొయింది, అందుకనే ఇందులో దొంగ నోట్లు (#FarziReview) ముద్రించే వాడుగా చూపించటం అంతగా ఆకళింపు చేసుకోలేము. చివరలో ఏదైనా చిన్న ఆశ్చర్యకర సన్నివేశం ఏదైనా చూపిస్తారేమో అనుకున్నా, చివరి వరకు కథానాయకుడిని నెగటివ్ షేడ్స్ తోటే చూపించారు. అదే కొంచెం బాగోలేదు అనిపిస్తుంది.

ఇంకా విజయ్ సేతుపతి పాత్ర కూడా చాలా బాగా రాసారు అనే చెప్పాలి. ఒక పోలీస్ అధికారిగా వున్నప్పుడు అతని నడక, హావభావాలు, అతని మాటలు చాలా బాగున్నాయి, కొన్ని నవ్విస్తాయి కూడా. ముఖ్యంగా విజయ్ సేతుపతికి మంత్రి కి మధ్య జరిగిన సన్నివేశాలు అన్నీ చాలా హాస్య భరితంగా, సహజసిద్ధంగా కూడా వున్నాయి. కానీ విజయ్ సేతుపతి వ్యక్తిగత జీవితం ఇంకా కొంచెం లోతుగా బాగా రాసుంటే బాగుండేది. అవి అంతగా హత్తుకోలేదు. అలాగే ఒక్కో సన్నివేశమూ చూపించిన తీరు, తీసే విధానం చాలా మెప్పించారు.

అంతర్జాతీయ ముఠా నాయకుడు మన్సూర్, ఈ ఇద్దరు స్నేహితులను ఎలా కలిసాడు, వాళ్ళని ఎలా తన దారికి తెప్పించి వాళ్ళతో పెద్ద మోతాదులో భారతదేశం లోకి దొంగనోట్ల రవాణా కోసం ఎలా ముద్రించాడు అన్న సన్నివేశాలు ఆసక్తికరంగా వున్నాయి. అలాగే సన్నీ, అతని స్నేహితుడు ఫిరోజ్ దొరికిపోతారేమో అనుకుంటూ ఉంటాం, కానీ తప్పించుకుంటూ వుంటారు వాళ్ళందరి మధ్యలో ఈ పిల్లి ఎలుకల గేమ్ ని బాగా రాసారు. చూసేవాళ్ళకి ప్రతి ఎపిసోడ్ ఎలా ఉంటుందో, ఎప్పుడు చూసేద్దాం అన్నంతగా కథనం వుంది. మొత్తం మీద ఈ 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ తో రాజ్ & డీకే లు ఇంకో విజయం తమ కతాలో వేసుకున్నారు. (#FarziReview)

ఇక నటీనటుల విషయానికి వస్తే, షాహిద్ కపూర్ ఇలాంటి వెబ్ సిరీస్ చెయ్యడం, అందులోకి ఇలాంటి పాత్ర చెయ్యడం హర్షించదగ్గ విషయం. ఇతని తరహాలో మిగతా నటులు కూడా అలోచించి ఒక్క సినిమాలే కాకుండా, ఇలాంటి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తారని ఆశిద్దాం. షాహిద్ తన పాత్రకి ప్రాణం పోసాడు అనే చెప్పాలి. చాలా అలవోకగా సన్నీ అనే పాత్రలో ఇమిడిపోయాడు. మొదటి ఎపిసోడ్ లో ఎలా నటించాడో చివరి ఎపిసోడ్ వరకు అలానే నటించాడు. ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ మాత్రం ఫిరోజ్ పాత్ర పోషించిన భువన్ అరోరా. నాకు బాగా నచ్చేసాడు కూడా. సూపర్ గా చేసేది, హాస్యం బాగా పండించాడు, అలాగే భావోద్వేగ సన్నివేశాలు కూడాను. షాహిద్ తో సమానంగా ఇతని పాత్ర ఉంటుంది. విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ గా బాగున్నాడు. అతనికి ఇది ఒక వైవిధ్యమయిన పాత్ర. అతనికి, మంత్రి కి మధ్య సంభాషణలు, సన్నివేశాలు హాస్యంగా, సరదాగా చాలా బాగున్నాయి. మంత్రిగా జాకిన్ హుస్సేన్ తన నటనని చూపించాడు. (#FarziReview)

నకిలీ నోట్ల సిండికేటే ముఠా నాయకుడిగా కే కే మీనన్ మరోసారి తన ప్రతిభని చూపాడు. అతను ఇప్పటికే గొప్ప నటుడు అని పేరుంది, అలాంటిది ఇందులో మరోసారి ఇరగదీసాడు. అలాగే రాశి ఖన్నా ఆర్.బి.ఐ లో పనిచేసే ఉద్యోగిగా బాగుంది. రాశి ఖన్నా చాల అందంగా, నీట్ గా వుంది. సినిమాలలో ఆడో రకంగా కనపడే రాశి ఇందులో చాలా చక్కగా ఉంది. ఆమె డ్రెస్సింగ్ ఈ వెబ్ సిరీస్ లో బాగుంది, నీట్ గా. ఇంకా అమోల్ పాలేకర్ గురించి చెప్పనవసరం లేదు. అతను మంచి నటుడు, ఇందులో షాహిద్ కి తాతగా వేశారు. ఇంకా చిత్తరంజన్ దాస్ క్రాంతి పత్రిక లో మేనేజర్ గా మంచి పాత్ర చేసాడు. రెజినా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. అలాగే కావ్య థాపర్ కూడా. 'ఫామిలీ మాన్' లో వుండే చెల్లం సార్ పాత్ర ఒక సన్నివేశం లో కనిపిస్తాడు. అతన్ని కొంచెం పొడిగిస్తే బాగుండేది. అలాగే మిగతా పాత్రల్లో చాలామంది కనపడతారు, వాళ్ళందరూ కూడా బాగానే పాత్ర మేరకు నటించారు. (#FarziReview)

ఇంకా సంగీతం కథకి తగ్గట్టుగా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా చక్కగా చూపించారు. అక్కడక్కడా కొంచెం సాగదీతలు వున్నా, మొత్తం మీద 'ఫర్జీ' బాగానే తీశారు అని చెప్పాలి. (#FarziReview)

రాజ్ & డీకే లు మన తెలుగు వాళ్ళు అవటం నిజంగా గర్వకారణం. ఇంతకు ముందు 'ఫామిలీ మాన్' లాంటి వెబ్ సిరీస్ రెండు సీజన్స్ తీసి వెబ్ సిరీస్ థేయ్యటం లో హాలీవుడ్ వాళ్ళకి ఏమీ తీసిపోము అన్నట్టుగా చూపించారు. అదే స్థాయిలో ఈ 'ఫర్జీ' ని కూడా తీసి, మంచి నటీనటుల్ని ఎంపిక చేసుకొని మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు కథని ఆసక్తికరంగా మలచటం లో కృతకృత్యులయ్యారు. విజయం సాధించారు అనే చెప్పాలి. చివర్లో ఇదొక్కటే సీజన్ కాదు, దీనికి రెండో సీజన్ కూడా ఉంటుంది అని వచ్చేట్టు చూపించారు. అలాగే కథానాయకుడి పాత్ర ఇంకా కొంచెం బలంగా రాస్తే బాగుండేది. (#FarziReview)

ఎందుకంటే అతను మొదట్లో మంచివాడే, కానీ పరిస్థితుల ప్రభావాలను ఆలా మారాల్సి వచ్చింది అనే పాయింట్ ని ఇంకా కొంచెం భావోద్వేగం తో రాస్తే బాగుండేది. డబ్బు సంపాదిస్తున్న కొద్దీ ఇంకా సంపాదించాలనే అత్యాశకి ఎలా వాళ్ళు తాము ఎన్నుకున్న దొంగదారిలో ప్రయాణించారు అన్న విషయం కూడా బాగా చూపించారు. రాజ్ & డీకే లు ఇలా వెబ్ సిరీస్ లో తీస్తూ పేరు సంపాదిస్తుంన్నందుకు అభినందనలు. ఇంకా రెండో సీజన్ లో ఎవరుంటారో, ఎవరు వస్తారో చూడాలి. రెండో సీజన్ లో అయినా చెల్లం సార్ పాత్ర నిడివి కొంచెం ఎక్కువ చూపిస్తారేమో చూడాలి. అక్కడక్కడా మరీ సినిమాటిక్ గా వున్నా, 'ఫర్జీ' వెబ్ సిరీస్ ని చూసి ఆనందించవచ్చు.

Updated Date - 2023-02-14T16:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising