ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: ఐదో సారయినా అబ్బాయే పుట్టాలని కోరుకున్న తండ్రి.. కాసేపట్లో భార్యకు డెలివరీ అనగా మృతి.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-08-14T21:47:49+05:30

ఐదోసారి గర్భం దాల్చిన భార్య మగబిడ్డకు జన్మనివ్వాలని కోరుకున్న ఓ తండ్రి ఆమె ప్రసవించిన రోజే దుర్మరణం చెందాడు. ఆసుపత్రికి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అతడికి యాక్సిండెట్ జరగడంతో దుర్మరణం చెందాడు. మరోవైపు భార్య ఆడశిశువుకు జన్మనిచ్చింది. రాజస్థాన్‌లోని పాళీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: అప్పటికే అతడికి నలుగురు ఆడపిల్లలు. భార్య మరోసారి గర్భం దాల్చడంతో ఈసారైనా భగవంతుడు తనకు మగసంతానం ఇస్తాడని కొండంత ఆశపెట్టుకున్నాడు. ఇంటిల్లపాదీ మగపిల్లాడి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నారు. డెలివరీ టైం రానే వచ్చింది. అతడి భార్యను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. తన పని ముగించుకుని ఆసుపత్రికి చేరాల్సిన మహిళ భర్త మాత్రం ఎంతకీ రాలేదు. ఈలోపు అతడి భార్య ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలోనే అతడు మృతి చెందాడన్న వార్త వారికి చేరడంతో యావత్ కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. రాజస్థాన్‌లోని(Rajasthan) పాళీ జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన.


జిల్లాలోని రోహత్ ప్రాంతానికి చెందిన పింటూ అనే వ్యక్తి నలుగురు ఆడపిల్లలు. ఐదోసారి గర్భందాల్చిన అతడి భార్యను కుటుంబసభ్యులు డెలివరీ కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పింటూ తనపనిమీద బయటకు వెళ్లాడు. అప్పటికి సాయంత్రం కావస్తోంది. పని ముగించుకుని ఆసుపత్రికి బయలుదేరుదామని పింటూ అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.


రహదారిపై వెళుతున్న పింటూ వైపునకు దూసుకొచ్చిన ఓ ట్రాక్టర్ అతడిని బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన పింటూనూ ఆసుపత్రికి తరలించేలోపే అతడు దుర్మరణం చెందారు(Husband dies on the same die wife delivers baby). పింటూ కోసం ఆసుపత్రి వద్ద ఎదురు చూస్తున్న బంధువులు, కుటుంబసభ్యులకు అతడి మరణవార్త చేరడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డపుట్టిందన్న ఆనందం వాళ్లలో క్షణాల్లో కనుమరుగైపోయింది. ఇక పింటూను ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్ సునీల్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-08-14T21:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising