ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: గ్యాస్ స్టవ్‌లను అమెరికాలో నిషేధించబోతున్నారా..? అగ్రరాజ్యంలో కొత్త కలవరం.. నిజంగా గ్యాస్‌స్టవ్‌లతో రిస్కేనా..?

ABN, First Publish Date - 2023-02-09T21:13:52+05:30

అమెరికాలో గ్యాస్ స్టవ్‌లను నిషేధించబోతున్నారంటూ చర్చ. ఇది నిజమేనా.. గ్యాస్‌ స్టవ్‌లతోనూ ఆరోగ్య సమస్యలు వస్తాయా.. ?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కట్టెలు, బొగ్గుల పొయ్యిలు మనలో చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. గొట్టంతో ఊదుతూ మంట రాజేయడం..పొయ్యిలోంచి ఎగసిపడే పొగ, వేడిని తట్టుకోలేక ఇళ్లల్లో ఆడవాళ్లు నానా అవస్థలు పడటం ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చూస్తుంటాం. కట్టెల పొయ్యి వాడకంతో చాలా మంది శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడేవారు. కానీ.. కిరోసిన్, గ్యాస్ స్టవ్‌లు వచ్చాక ఈ దృశ్యాలన్నీ దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. అమెరికాలో(USA) ప్రస్తుతం గ్యాస్‌ స్టవ్‌లతోనూ ఆరోగ్య సమస్యలు తప్పవనే చర్చ మొదలైంది. అంతేకాదు..వీటిని బ్యాన్ చేస్తారన్న(Ban On Gas stoves) ఊహాగానాలు కూడా ఉన్నాయి.

అమెరికా ప్రభుత్వ సంస్థ కన్స్యూమర్ ప్రాడక్ట్ సేఫ్టీ కమిషన్(సీపీఎస్‌సీ).. గ్యాస్ స్టవ్‌లపై నిషేధం విధించాలని ప్రతిపాదించిందన్న వార్తతో ఇటీవల కలకలం రేగింది. దీనిపై స్పందించిన సీపీఎస్‌సీ కమిషనర్.. గ్యాస్‌ స్టవ్‌లు ఇళ్లల్లో కాలుష్యం పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై జరిగిన పలు పరిశోధనల్లో గ్యాస్ స్టౌవ్‌లు కాలుష్య కారకాలేనని తేలినట్టు పేర్కొన్నారు. ‘‘ఇళ్లలో కాలుష్యాన్ని(Indoor Pollution) తగ్గించేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం. ఆరోగ్య సమస్యలు కలిగించని విధంగా ఏదైనా ఉత్పత్తిని తయారు చేయలేని పక్షంలో నిషేధం విధించొచ్చు. అయితే..ప్రస్తుతం గ్యాస్ స్టవ్‌లపై దేశవ్యాప్త నిషేధం విధించాలని అధికారికంగా ఎటువంటి ప్రతిపాదన పెట్టలేదు. కానీ.. గ్యాస్ స్టవ్‌లకు బదులు ప్రజలు విద్యుత్ స్టౌవ్‌ల వైపు మళ్లాలనుకుంటే మేము సాయం చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలో సుమారు 40 మిలియన్ల ఇళ్లల్లో గ్యాస్ స్టవ్‌లు ఉన్నాయని ఓ అంచనా

గ్యాస్‌ స్టవ్‌‌తో సమస్య ఇదీ..

గ్యాస్ స్టవ్‌ల నుంచి నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు, కంటికి కనిపించని సూక్ష్మధూళి కణాలు హానికర పరిమాణంలో వెలువడతాయి. వీటి వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, క్యాన్సర్‌తో పాటూ ఇతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిసీ ఇంటిగ్రెటీ, అమెరికన్ కెమికల్ సొసైటీ తదితర సంస్థలు గతంలో పేర్కొన్నాయి. ముఖ్యంగా చిన్నారులకు గ్యాస్ స్టవ్‌లతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయట. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో డిసెంబర్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. 12 శాతం చిన్నారుల ఆస్తమా కేసులకు గ్యాస్‌స్టవ్‌లూ కారణమని తేలింది. సీపీఎస్‌సీ.. గ్యాస్‌ స్టవ్‌ల కాలుష్యం అంశాన్ని చాలా కాలంగా పరిశీలిస్తోంది. ఈ విషయంలో తొలుత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కొంతకాలం క్రితం ప్రతిపాదించింది.

Updated Date - 2023-02-09T21:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising