Flipkart Employee: ఓ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగికి వింత కష్టం.. రోజుకు 12 గంటల పాటు పనిచేస్తున్నా మిగులుతోంది ఇంతేనంటూ..!
ABN, First Publish Date - 2023-07-20T17:05:57+05:30
రోజు 12 గంటల పాటు ఉద్యోగం చేసి తెచ్చుకున్న శాలరీలో సగానికిపైగా పన్ను కింద చెల్లిస్తున్నానంటూ ఓ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తామకూ ఇలాంటి బాధ కలిగిందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ ఉద్యోగి అయినా కష్టపడేది నాలుగు మెతుకుల కోసమే. అది పోను ఏదైనా మిగిలితే రిటైర్‌మెంట్ కోసం దాచుకుంటాడు. బడా కంపెనీ సీఈఓ అయినా, చిరు ఉద్యోగి అయినా స్థూలంగా ఇవే లక్ష్యాలు ఉంటాయి. అయితే, ఇలా కష్టపడి సంపాదించిన సొమ్ము ఏమైపోతోందో గ్రహింపునకు వచ్చిన ఓ ఫ్లిప్‌కార్డు ఉద్యోగి తన ఆవేదనను నెట్టింట్లో పంచుకున్నాడు. ప్రతి రోజూ 12 గంటల పాటు కష్టపడుతుంటే నాకు మిగులుతోంది ఇంతేనా అంటూ అతడు పెట్టిన పోస్ట్ నెట్టింట కలకలం రేపుతోంది.
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి(Flipkart employee) సంచిత్ గోయల్ తన రాబడి, ఖర్చుల గురించి వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘ఈ రోజు నేను రూ.5 వేల ఆర్జింజా. ఇందులో 30 శాతం ప్రభుత్వానికి పన్ను కట్టా. కెఫిన్ ఉన్న మంచి డ్రింక్స్ కొనుకున్నా.. ఈ క్రమంలో మళ్లీ 28 శాతం టాక్స్ కట్టా. అంటే.. జీతంలో సగానికిపైగా ప్రభుత్వానికి ఇచ్చేందుకే నేను రోజూ ఉద్యోగంలో 12 గంటల పాటు కష్టపడుతున్నానని నాకిప్పుడు అర్థమైంది. ఉదాహరణకు మనం రూ.20 పెట్టి ఓ చాకోబార్ కొనుక్కుంటే ప్రభుత్వానికి ఎంత వెళుతుందో చూద్దాం. చాకోబార్ కొనుక్కున్న వాళ్లు 18 శాతం జీఎస్‌టీ కింద చెల్లించాలి(taxes). మనం ఖర్చుపెట్టే ఒక్కో రూపాయికి ప్రభుత్వానికి చాలానే పోతోంది. చక్కెరపై 18 శాతం పన్ను రూ.0.36, కొకోవాపై 18 పన్ను కింది మరో రూ0.9, కండెన్సడ్ మిల్క్‌పై(12 శాతం) రూ.0.6, క్రీమ్ పై చెల్లించే(5 శాతం పన్ను) రూ.0.1 వెరసి మొత్తం 27.5 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వానికి రూ.5.5 చేరుతోంది’’ అని వివరించాడు(half of salary goes to government).
దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది(Viral). తమకూ పలుమార్లు ఇలాగే అనిపించిందని నెటిజన్లు వాపోయారు. ఉద్యోగులు తమ కష్టించి సంపాదించుకున్న దాంట్లో నిత్యం సగం పన్నులు కింద చెల్లిస్తున్నా వారికి ఒరిగేదేం లేదని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కట్టిన పన్నులు అవినీతి పరుల జేబూల్లోకి చేరుతోందని మండిపడుతున్నారు. వ్యాణిజ్యానికి ప్రోత్సాహం పేరిట బడా కంపెనీలకు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు పన్నుల్లో భారీ మినహాయింపులు ఇస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని వాపోయారు. కొందరు మాత్రం వ్యవసాయం చేసుకుంటూ కొబ్బరి నీళ్లు తాగితే ఏ తంటా ఉండదని చెప్పుకొచ్చారు. ఐరోపా లాంటి దేశాలకు పోతే ఈ ఇబ్బందులు తప్పుతాయని మరికొందరు సూచించారు.
Updated Date - 2023-07-20T17:09:39+05:30 IST