Money: కూతురి కేన్సర్ చికిత్సకై ఉన్నదంతా ఖర్చు పెట్టిన తల్లి.. ఆస్పత్రి నుంచి తిరిగొచ్చిన మర్నాడే ఏకంగా రూ.16 కోట్లు..!
ABN, First Publish Date - 2023-04-08T21:32:32+05:30
లక్ ఎప్పుడు పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు! కూతురి క్యాన్సర్ చికిత్స కోసం తన జీవతంలో సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టిన ఓ మహిళ ఆ మరుసటి రోజే కోటీశ్వరురాలైపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: లక్ ఎప్పుడు పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు! కూతురి క్యాన్సర్ చికిత్స కోసం తన జీవతంలో సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టిన ఓ మహిళ ఆ మరుసటి రోజే కోటీశ్వరురాలైపోయింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో(Florida) వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా వైరల్‌గా మారింది.
లేక్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన గింబ్లెట్ కుమార్తె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ఇటీవలే ఆమె చికిత్స పూర్తయింది. ఆమె పూర్తిస్థాయిలో కోలుకుంది. అయితే.. కూతురి చికిత్స కోసం గింబ్లెట్ తన వద్ద ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయితే.. తన డబ్బంతా ఖర్చైపోయినందుకు గింబ్లెట్ ఏనాడు బాధపడలేదు. కూతురు క్షేమంగా ఉంటే చాలనుకుంది.
కూతురి చికిత్స చివరి రోజున ఆమె ఓ షాపులో లాటరీ టిక్కెట్ కొంది. అది ఆమె నిత్యం చేసేదే. క్రాస్‌వర్డ్ పజిల్ పూర్తి చేయడం ద్వారా ఈ లాటరీ గెలవచ్చు. క్రాస్ వర్డ్స్ అంటే ఆమెకు ఇష్టం కావడంతో దాన్ని ఎంచుకుంది. అయితే.. తొలుత షాపు యజమాని తన వద్ద టిక్కెట్లు ఏవీ లేవని అన్నాడు. కానీ.. గింబ్లెట్ మాత్రం మరోసారి వెతకమని షాపులోని వ్యక్తికి చెప్పింది. ఈ క్రమంలో దొరికిన టిక్కెట్‌ను అతడు గింబ్లెట్కు విక్రయించాడు. ఇంటికెళ్లాక ఆ టిక్కెట్ చూసుకున్న గింబ్లెట్కు ఊహించని షాక్ తగిలింది. తాను లాటరీలో(Lottery) ఏకంగా రూ.16 కోట్లు గెలుచుకున్నట్టు గుర్తించిన ఆమెకు అసలు నోటమాట రాలేదు. ఈ సర్ప్రైజ్ను మెల్లగా కోలుకున్న ఆమె చివరకు తాను గెలుచుకున్న డబ్బును సంబరపడిపోతూ ఇంటికి తెచ్చుకుంది.
Updated Date - 2023-04-08T21:32:32+05:30 IST