Gopi Chand: మంచి మనస్సు.. అసిస్టెంట్ సర్‌ప్రైజ్..

ABN, First Publish Date - 2023-03-01T15:43:27+05:30

టాలీవుడ్ స్టార్స్ వెండితెర పైనే కాదూ నిజ జీవితంలోను తాము హీరోలమని నిరూపించుకుంటున్నారు. గతంలో ఎన్నో సార్లు వారు మంచి మనస్సును చాటుకున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో గోపిచంద్ (Gopi Chand) తన సహృదయంతో, వ్యక్తిగత సహాయకుడిని ఆశ్చర్యపరిచారు.

Gopi Chand: మంచి మనస్సు.. అసిస్టెంట్ సర్‌ప్రైజ్..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టాలీవుడ్ స్టార్స్ వెండితెర పైనే కాదూ నిజ జీవితంలోను తాము హీరోలమని నిరూపించుకుంటున్నారు. గతంలో ఎన్నో సార్లు వారు మంచి మనస్సును చాటుకున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో గోపిచంద్ (Gopi Chand) తన సహృదయంతో, వ్యక్తిగత సహాయకుడిని ఆశ్చర్యపరిచారు.

గోపిచంద్ దగ్గర శ్రీను అనే వ్యక్తి కొన్నాళ్లుగా వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే శ్రీను ఇంటిని కట్టుకున్నారు. బుధవారం గృహ ప్రవేశం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి గోపిచంద్ స్వయంగా హాజరయ్యి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు. పంక్షన్‌లో కాసేపు సందడి చేశారు. అనంతరం పూజలో పాల్గొన్నారు. గోపిచంద్ సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో శ్రీను కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఈ ఘటనతో గోపిచంద్ తన స్టార్ స్టేటస్‌ను మరిచి మనసున్నవ్యక్తిగా నిరూపించుకున్నారు. ఇక గోపిచంద్ కెరీర్ విషయానికి వస్తే..చివరగా ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) లో నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రస్తుతం ‘రామబాణం’ (Rama Banam)లో నటిస్తున్నారు. శ్రీవాస్ (Sriwass) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-01T15:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!