Guinness World Record: 131 కిలోల కేక్ ధరించిన అమ్మాయి
ABN, First Publish Date - 2023-02-15T11:02:42+05:30
కేక్ అంటే సాధారణంగా ఏ పాత్రల మీదో కప్పుల మీదో తయారు చేసే పదార్థం. అయితే.. కొన్ని కొన్ని చోట్ల ఇటీవల కళా ఖండాలుగానూ
ఇంటర్నెట్ డెస్క్: కేక్ అంటే సాధారణంగా ఏ పాత్రల మీదో కప్పుల మీదో తయారు చేసే పదార్థం. అయితే.. కొన్ని కొన్ని చోట్ల ఇటీవల కళా ఖండాలుగానూ రూపొందిస్తున్నారు. బొమ్మలుగా కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి మించి ప్రయోగం చేయాలనుకున్నారేమో..ఒక బేకర్ ఏకంగా కేక్‌తో డ్రెస్స్‌ను రూపొందించాడు. ప్రస్తుతం ఇదీ గిన్నిస్ రికార్డ్(Guinness World Record) సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..స్వీట్జర్లాండ్(Switzerland)కు చెందిన ఒక బేకర్ ప్రపంచంలోనే అతి పెద్ద కేక్(Cake) దుస్తులను తయారు చేశాడు.
ఇవి చక్కగా ధరించే అవకాశం ఉండటం గమనర్హం. అంతేకాదు..ఈ కేక్ డ్రెస్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. స్వీటీ కేక్ సీకి చెందిన ‘‘నటాషా కొలిన్ కిమ్ ఫాహిలీ ఫోకస్’’ జనవరి 15న స్విట్జర్లాండ్(Switzerland)లోని బెన్‌లో ఎగ్జిబ్యూటర్ల(Exhibitors) ముందు కేక్ పదార్థాలతో చేసిన తన దుస్తులను ప్రదర్శించారు.’’ ధరించగలగిన కేక్ దుస్తులు అసాధరణమైన 131.1.5 కిలోల బరువుతో ఉన్నాయి. స్వీట్ కేక్స్ అనేది 2014లో నటాషాచే స్థాపించబడి స్విట్జర్లాండ్‌లోని దున్లో ఉన్న కస్టమ్ కేక్‌లలో ప్రత్యేకత కలిగిన బేకరి. ఇది పలు సందర్భాలలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ‘‘నటాషా కొలిన్ కిమ్ ఫాహిలీ ఫోకస్’’ స్వీట్ కేక్ ద్వారా ధరించగలిగే.. అతిపెద్ద కేకు 131.1.5 కేజీ క్యాప్షన్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్స్టాగ్రామ్(Instagram) హ్యాండిల్లో వీడయో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇదీ సోషల్ మీడియా(Social media)లో భారీ ఎత్తున్న వైరల్ అవుతుండటం విశేషం. మొత్తానికి ఈ అమ్మాయి కొరుకుతినే సన్నాయిలా ఉందని కొందరు ముచ్చటపడుతున్నారు.
Updated Date - 2023-02-15T11:12:46+05:30 IST