భర్త నుంచి నా ప్రేయసిని విడిపించండి.. మమ్మల్ని కలపండి.. ఇదీ ఓ భగ్న ప్రేమికుడి పిటిషన్.. హైకోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పు ఏంటంటే..
ABN, First Publish Date - 2023-03-17T21:02:52+05:30
భర్త నుంచి ప్రేయసిని విడిపించమంటూ కోర్టును ఆశ్రయించిన యువకుడికి షాక్
ఇంటర్నెట్ డెస్క్: భర్త నుంచి నా ప్రేయసిని విడిపించండి.. మమ్మల్ని కలపండి.. అంటూ కోర్టును ఆశ్రయించిన ఓ భగ్న ప్రేమికుడికి ఊహించని షాక్ తగిలింది. కోర్టుకు రూ. 5 వేల జరిమానా చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బానస్‌కాంతా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇటీవల గుజరాత్ హైకోర్టును(High Court) ఆశ్రయించాడు. కోర్టు హెబియస్ కార్పస్(Habeas Corpus petition) పిటిషన్ దాఖలు చేసిన అతడు.. తన ప్రేయసిని తనకు అప్పగించమని కోర్టును అభ్యర్ధించారు. తన ప్రేయసి ఆమె భర్త నుంచి విడిపించండని అభ్యర్ధించారు. ఆమెకు భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేదని పేర్కొన్నాడు. ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశాడని ఆరోపించారు. అంతేకాకుండా.. ప్రియుడితో ఉండటమే ఇష్టమంటూ ఆమె రాసిచ్చిన లేఖను కూడా కోర్టు ముందు పెట్టాడు.
అతడి వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో అతడు పిటిషన్ దాఖలు చేసేందుకు లోకస్ స్టాండీ లేదని స్పష్టం చేసింది. అతడి ప్రియురాలు విడాకులకు కూడా దరఖాస్తు చేయని విషయాన్ని పేర్కొంది. అంతేకాకుండా.. ఆమె ఇప్పటికీ భర్తతో కలిసి ఉంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చట్టవిరుద్ధంగా భర్త ఇంట్లో చిక్కుకుపోయినట్టు భావించలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో యువకుడు కోర్టుకు రూ. 5 వేల జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది.
Updated Date - 2023-03-17T21:02:52+05:30 IST