America: అమెరికా యువతికి షాకింగ్ అనుభవం.. గన్ గురిపెట్టి ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయ్యాడు.. కాసేపటికే అతడు పంపిన మెసేజ్ చూసి..!
ABN, First Publish Date - 2023-06-27T22:24:16+05:30
అమెరికాలో ఇటీవల ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె వద్ద డబ్బు దోచుకుని పారిపోయిన ఓ వ్యక్తి ఆ తరువాత తనతో డేట్‌కు రావాలంటూ ఫోస్‌బుక్‌లో మేసేజ్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో(USA) ఇటీవల ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె వద్ద డబ్బు దోచుకుని పారిపోయిన ఓ వ్యక్తి ఆ తరువాత తనతో డేట్‌కు రావాలంటూ ఫోస్‌బుక్‌లో మేసేజ్ పెట్టాడు(Gunman Robs US Woman). దీంతో, యువతికి దిమ్మతిరిగినంతపనైంది.
ఇండియానాపొలిస్‌లో ఉండే ఆ యువతి ఇటీవల తన పోస్ట్‌బాక్స్‌లో లెటర్లు తీసుకునేందుకు బయటకు వచ్చింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెవైపు గన్ను చూపిస్తూ డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ‘‘నీ ఇంట్లోకి నన్ను తీసుకెళ్లు’’ అని ఆమెను బెదిరించాడు. అయితే, బాధితురాలు అతడికి వంద డాలర్లు ఇచ్చి వెళ్లిపోమని చెప్పింది. కానీ, దుండగుడు బాధితురాలిని తనతో ఫేస్‌బుక్‌లో కనెక్ట్ కావాలంటూ మళ్లీ గన్ను చూపించి బెదిరించాడు. దీంతో ఆమె అలాగే చేసింది.
ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితుడు బాధితురాలికి ఫేస్‌బుక్‌లో సందేశం పంపించాడు. ‘‘నీవు చాలా అందంగా ఉన్నావు. నిన్ను దోపిడీ చేసేందుకు మనసు రాలేదు’’ అని మెసేజ్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన మహిళ..‘‘బాధపడుకు.. నీవు కష్టాల్లో ఉన్నట్టు ఉన్నావు’’ అని బదులిచ్చింది. దీంతో, మరింత రెచ్చిపోయిన నిందితుడు తనతో డేటింగ్‌కు రావాలంటూ విజ్ఞప్తి చేశాడు(Asking Her Out On Facebook).
వ్యవహారం ఎక్కడితో వెళుతోందని బెదిరిపోయిన యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని డేమియన్ బాయిడ్‌గా గుర్తించారు. ఈ నెల మొదట్లో అతడు ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడని, మరో వ్యక్తి తలపై రాయితో కొట్టి గాయపరిచాడని చెప్పారు. కాగా, ఈ ఘటనతో యువతి తీవ్ర భయాందోళనలకు లోనైంది. ఇలాంటి వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారంటే భయమేస్తోందని మీడియాతో వ్యాఖ్యానించింది.
Updated Date - 2023-06-27T22:24:19+05:30 IST