Viral: రాత్రి 10 గంటలు.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మద్యం సేవించేందుకు రెడీ అయిన యువకుడు.. వంటింట్లోంచి ఐస్ క్యూబ్స్ తెచ్చాక దారుణం..
ABN, First Publish Date - 2023-10-12T15:41:20+05:30
యువతితో ఆన్‌లైన్ పరిచయం ఓ యువకుడి కొంప ముంచింది. ఓ రోజు రాత్రి అతడి ఇంటికొచ్చిన ఆమె యువకుడికి మత్తుమందు ఇచ్చి స్పృకోల్పోయేలా చేసింది. ఆ తరువాత అతడి వద్ద ఉన్న సొమ్ముతో ఉండాయించింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు దేశంలో కేవలం పెద్దలు కుదిర్చిన వివాహాలు మాత్రమే ఉండేవి. ఆ తరువాత ప్రేమ వివాహాలు ఎంట్రీ ఇచ్చాయి. ఇందుకు కార్యాలయాలు, కాలేజీలు వేదిక అయ్యాయి. కాస్తో కూస్తో పరిచయం ఉన్న వారి మధ్య ప్రేమవ్యవహారాలు నడిచేవి. కానీ, ఆన్‌లైన్ డేటింగ్ ఎంట్రీ ఇచ్చాక పరిస్థితులు ఒక్కసారిగా తిరగబడ్డాయి. డేటింప్ యాప్‌లో ప్రొఫైల్ ఎంట్రీ చేస్తే చాలు.. మరుసటి రోజు కల్లా అపరిచితులతో పరిచయం అయిపోతుంది. అన్నీ కుదిరితే డేటింగ్ కూడా మొదలవుతంది. కానీ, ఇన్‌స్టంట్ పరిచయాలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో చెప్పే ఘటన ఒకటి హర్యానాలోని(Haryana) గురుగ్రామ్ నగరంలో ఇటీవల వెలుగు చూసింది. యువతి చేసిన మోసం తట్టుకోలేక బాధితుడు రోహిత్ గుప్తా పోలీసులను ఆశ్రయించాడు(Gurugram man drugged, robbed by woman he met on Bumble, loses gold, cash, iPhone).
రోహిత్ గుప్తా ఫిర్యాదు ప్రకారం..బంబుల్ డేటింగ్ యాప్‌లో అతడికి సాక్షి అనే యువతి పరిచయమైంది. తనదీ ఢిల్లీయేనని ఆమె రోహిత్‌కు చెప్పింది. తన బంధువు ఇంట్లో ఉంటున్నానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఇద్దరి మధ్యా బంధం మరింత గట్టిపడింది. ఈ క్రమంలో అక్టోబర్ 1 రాత్రి 10 గంటలకు ఆమె రోహిత్‌ఖు ఫోన్ చేసింది. తనను వచ్చి ఇంటికి తీసుకెళ్లమని చెప్పింది. దీంతో, ఆమె చెప్పిన చోటికి వెళ్లి కారులో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో బీర్ బాటీళ్లు కూడా కొన్నాడు. ఇంటికొచ్చాక ఇద్దరూ మద్యం సేవించేందుకు ఉపక్రమించారు.
Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..
ఈ క్రమంలో సాక్షి రోహిత్‌ను ఐస్ తెమ్మని చెప్పింది. దీంతో, అతడు వంటింట్లోకి వెళ్లాడు. అతడు అలా వెళ్లగానే యువతి అతడి డ్రింక్‌లో ఏదో తెలియని మత్తు మందు కలిపి ఆ తరువాత ఏమీ ఎరగనట్టు కూర్చుంది. ఆ తరువాత వచ్చి యువకుడు యథాప్రకారం మద్యం సేవించి ఆ తరువాత స్పృహ లేకుండా పడిపోయారు. యువతి కలిపిన మత్తుమందు చాలా శక్తివంతమైనది కావడంతో అతడి రెండో రోజు ఉదయం మెలకువ వచ్చింది.
రోహిత్ గుప్తే లేచి చూసేసరికి ఇంట్లో యువతి కనిపించలేదు. అంతేకాదు. అతడి మెడలో ఉన్న బంగారం చెయిన్, ఐఫోను, పర్సులోని రూ.10 వేల క్యాష్, క్రెడిట్, డెబిట్ కార్డులు అన్నీ పోయాయి. ఆ తరువాత బ్యాంక్ అకౌంట్లోని రూ.1.78 లక్షలు(Robbed of cash, gold chain, phone) కూడా అదృశ్యమైనట్టు అతడు గుర్తించాడు. చివరకు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, పోలీసులు ఇప్పటికీ యువతి కోసం గాలిస్తూనే ఉన్నారు.
Updated Date - 2023-10-12T22:10:08+05:30 IST