కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Care Tips: జుట్టు నల్లగా మారిపోవాలా..? తలస్నానం చేసేటప్పుడు షాంపూ బదులుగా వీటిని వాడితే..!

ABN, First Publish Date - 2023-08-24T16:00:26+05:30

చాలామంది చిన్నవయసులోనే తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన షాంపూలు జుట్టును మరింత తొందగా పాడుచేస్తాయి. అందుకే షాంపూకు బదులుగా వీటిని వాడితే..

Hair Care Tips: జుట్టు నల్లగా మారిపోవాలా..? తలస్నానం చేసేటప్పుడు షాంపూ బదులుగా వీటిని వాడితే..!

మారుతున్న జీవనశైలి కారణంగా నేటికాలంలో జుట్టు సంబంధ సమస్యలు అధికంగా ఉన్నాయి. తినే ఆహారం నుండి వాతావరణ కాలుష్యం, తాగే నీరుతో సహా అన్ని కలుషితమైపోయాయి. ఈ కారణంగానే జుట్టు విరిగిపోవడం, పెళుసుబారడం, బూడిద రంగులోకి మారడం వంటి సమస్యలొస్తున్నాయి. చాలామంది చిన్నవయసులోనే తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన షాంపూలు జుట్టును మరింత దారుణంగా మారుస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి సహజమైన షాంపూలు వాడాలి. రసాయనాల్లేని షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నా అవి ఖరీదుతో కూడుకున్నవి కావడాన అందరూ కొనలేరు. అందుకే ఇంట్లోనే అందుబాటులో ఉన్నవాటిని షాంపూగా ఉపయోగించవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

ప్రాచీన కాలం నుండి అందరూ జుట్టు శుభ్రం చేసుకోవడానికి కుంకుడుకాయ(soap nut) ఉపయోగిస్తున్నారు. కుంకుడు కాయను ఆయుర్వేదం నుండి అన్ని వైద్య విధానాలు ఆమోదించాయి. దీంతో జుట్టుకు నష్టం వాటిల్లకుండా శుభ్రం చేసుకోవచ్చు. పైపెచ్చు జుట్టు నల్లగా దృఢంగా మారుతుంది. కొన్ని కుంకుడుకాయలను పగలగొట్టి లోపలి విత్తనాలు తీసేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో కాసింత భృంగరాజ్ పౌడర్(bhringaraj powder) వేసి బాగా కలిపి దీన్ని కొద్దిసేపు స్టౌ మీద సన్నని మంటలో ఉడికించాలి. చల్లబడిన తరువాత దీన్ని జుట్టుకు షాంపూలా ఉపయోగించాలి. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.

Health Facts: ప్రతిరోజూ అదే పనిగా తలనొప్పి వస్తోందా..? ఈ 9 అంశాలే అసలు కారణం కావచ్చు..



మెంతులు(fenugreek) ఆరోగ్యానికే కాదు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి. జుట్టు నల్లగా, దృఢంగా మారడంలో మెంతులు సహయపడతాయి. వీటిని షాంపూకు బదులుగా జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం 3లేదా 4స్పూన్ల మెంతులను రాత్రి నీటిలో నానబెట్టాలి. లేదంటే కనీసం 4-5గంటలసేపు నానబెట్టుకోవాలి. ఈ మెంతులను మిక్సీలో మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ లో రెండు స్పూన్ల పెరుగు(curd), ఒక స్పూన్ తేనె(honey) కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లైచేసి షవర్ క్యాప్ తో కవర్ చేయాలి. సుమారు గంటసేపు దీన్ని అలాగే ఉంచి సాధారణంగా నీటితో తలస్నానం చేయాలి. ఇది సహజంగానే జుట్టును శుభ్రపరుస్తుంది. పైగా హెయిర్ ప్యాక్ గా కూడా పనిచేస్తుంది. జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది.

ముఖ సౌందర్యం గురించి అంతో ఇంతో అవగాహన ఉన్నవారికి కూడా ముల్తానీ మట్టి(multani mitti) గురించి తెలిసే ఉంటుంది. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ గా ఉపయోగించడమే అందరికీ తెలుసు. కానీ జుట్టు శుభ్రపరుచుకోవడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇందుకోసం ముల్తానీ మట్టిని నీళ్లలో నాలుగైదు గంటలసేపు నానబెట్టాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి సుమారు 1గంటసేపు అలాగే ఉంచాలి. గంట తరువాత సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

చాలామంది జుట్టు మృదువుగా, నిగనిగలాడుతూ ఉండటం కోసం, చుండ్రు తగ్గడం కోసం పెరుగు, నిమ్మకాయ(lemon, curd) వాడుతుంటారు. ఇది కేవలం జుట్టు సంబంధ సమస్యలు తగ్గించడానికే కాదు సహజమేన షాంపూగా పనిచేసి జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. చిన్న కప్పు పెరుగు, అందులో నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లనుండి చివర్ల వరుకు అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత సాధరణ నీటితో జుట్టు శుభ్రం చేసుకోవాలి.

Viral Video: రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్న ఈ వ్యక్తి.. ఇంగ్లీషులో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడేంటా అని ఆరా తీస్తే..!


Updated Date - 2023-08-24T16:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising