ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: వామ్మో.. ఇజ్రాయెల్ ఇలాంటి బాంబులు వాడుతోందా..? నెట్టింట కలకలం!

ABN, First Publish Date - 2023-10-10T19:02:34+05:30

హమాస్ ఉగ్రసంస్థ ఇజ్రాయెల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని సమాన్యులు ఉండే ప్రాంతాలపై వైట్‌ఫాస్ఫరస్ బాంబులతో దాడి చేస్తున్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణలు నెట్టింట కలకలం రేపుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఆకస్మికదాడితో ఇజ్రాయెల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై ప్రతిదాడి మొదలైంది. రాకెట్లు, బాంబుల ప్రయోగం, గగనతల దాడులతో గాజా ప్రాంతంలోని ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజాను అష్టదిగ్భంధనం చేసింది. విద్యుత్ సరఫరాను కూడా కట్ చేసింది. సాంకేతికంగా ముందున్న ఇజ్రాయెల్ తన శక్తినంతా కూడదీసుకుని దాడులకు దిగుతోంది. ఈలోపు హమాస్ ఇజ్రాయెల్‌కు సంబంధించి ఓ సంచలన వీడియో నెట్టింట్లో పోస్ట్ చేసింది. నిషేధిత వైట్‌ఫాస్ఫరస్ బాంబులను జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగిస్తోందంటూ మండిపడింది(Hamas accuses Israel of using white phosphorus bombs). హమాస్ ఆరోపణల్లో నిజానిజాలను పక్కనబెడితే.. ఈ పొటోలు, వీడియోలు మాత్రం నెట్టింట కలకలం రేపుతున్నాయి.

ఏమిటీ వైట్ ఫాస్ఫరస్ బాంబులు..?

లేత పసుపుపచ్చ రంగులో గ్రీస్ లాగా ఉండే వైట్‌ఫాస్ఫరస్‌కు మండే గుణం ఎక్కువగా. కాస్త గాలి తగలగానే వెంటనే అగ్గిరాజుకుని పెద్ద కాంతితో మండుతుంది. దీంతో, దీన్ని బాంబుల తయారీలో వాడేవారు. అమెరికాతో సహా అనేక దేశాల సైన్యాలు గతంలో ఈ బాంబులను వాడాయి. ఇది దాదాపు 815 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ మండుతుంది. అంతేకాకుండా, తెల్లని పొగను వెలువరిస్తుంది. దీంతో, వీటిని రాత్రి సమయాల్లో వెలుతురు అవసరమైనప్పుడు లేదా పొగతో శత్రుమూకలను కన్‌ఫ్యూజ్ చేసేందుకు, భారీ స్తాయిలో ప్రత్యర్థి శిబిరాల్లో అగ్గి రాజేసేందుకు వీటిని వాడేవారు.

Viral Video: మీకు ఎప్పుడూ బూట్లనే వాడే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త! ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేసిన వీడియోతో నెట్టింట గగ్గోలు!


1800ల్లోనే వైట్‌ఫాస్ఫరస్ బాంబులు వినియోగం మొదలైనప్పటికీ వీటితో కలిగే నష్టం దృష్ట్యా 1972లో ఐక్యరాజ్య సమితి వీటిని నిషేధిస్తూ తీర్మానం చేసింది. ఈ ఆయుధాలతో సామాన్య పౌరులకు కలిగే నష్టం అపారమని, ఇవి భయంకరమైన ఆయుధాలని పేర్కొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకసారి వైట్‌ఫాస్ఫరస్ అంటుకుంటే దాన్ని ఆర్పడం మహాకష్టం. చర్మం, దుస్తులపై పడి ఇది అంటుకుంటే చాలా లోతైన గాయాలు అవుతాయి. చాలా సందర్భాల్లో చర్మం, కండను దాటుకుని లోపలున్న ఎముకను కూడా దెబ్బతినేస్థాయిలో కాలిన గాయాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సామాన్య పౌరులకు ఇవి కలిగించే నష్టం మాటలకందనిదిగా ఉండటంతో ఐరాసా అప్పట్లోనే దీన్ని బ్యాన్ చేసింది. అయితే, హమాస్ ఆరోపణల నేపథ్యంలో వైట్‌ఫాస్ఫరస్‌ బాంబులపై మరోసారి నెట్టింట గగ్గోలు మొదలైంది.

Viral: ఫోన్ చోరీ అయితే పోనీలే అనుకున్నాడు! మరో ఫోన్‌లో కొత్త సిమ్ కార్డు వేశాక భారీ షాక్..!

Updated Date - 2023-10-10T19:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising