ఈ విషయం తెలియక రెస్టారెంట్‌లలోని హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?... అయితే పరిణామం ఎలా ఉంటుందంటే...
ABN, First Publish Date - 2023-04-13T08:46:47+05:30
ఏదైనా పెద్దమాల్‌కు వెళ్లినప్పుడు లేదా రెస్టారెంట్(Restaurant)కు వెళ్లినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకునేందుకు హ్యాండ్ డ్రైయర్(Hand dryer) వినియోగిస్తున్నారా? అయితే దీనివలన హాని జరుగుతుందని మీకు తెలుసా?
ఏదైనా పెద్దమాల్‌కు వెళ్లినప్పుడు లేదా రెస్టారెంట్(Restaurant)కు వెళ్లినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకునేందుకు హ్యాండ్ డ్రైయర్(Hand dryer) వినియోగిస్తున్నారా? అయితే దీనివలన హాని జరుగుతుందని మీకు తెలుసా? శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డైలీ మెయిల్(Daily Mail) నివేదిక ప్రకారం గాలిలో మిలియన్ల కొద్దీ రకరకాల బ్యాక్టీరియాలు(Bacteria) ఉన్నాయి.
మీరు హ్యాండ్ డ్రైయర్ కింద మీ చేతులను ఆరబెట్టినప్పుడు, అది బ్యాక్టీరియాను మీ చేతులపైకి చేరవేస్తుంది. చేతుల్లో తేమ ఉండడం వల్ల బ్యాక్టీరియా చర్మానికి అతుక్కుపోతుంది. పబ్లిక్ వాష్‌రూమ్(Public washroom)లలో పెద్ద సంఖ్యలో ఇ.కోలి, హెపటైటిస్, ఫీకల్ తదితర బ్యాక్టీరియాలు ఉన్నట్లు గత పరిశోధనలలో వెల్లడైంది. 2015లో నిర్వహించిన ఒక పరిశోధనలో రెస్ట్‌రూమ్(Restroom)లో దాదాపు 77,000 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు ఉన్నాయని తేలింది. పరిశోధన నివేదికల ప్రకారం టాయిలెట్‌ను ఫ్లష్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా వాష్‌రూమ్ అంతటా వ్యాపిస్తుంది.
పబ్లిక్ వాష్‌రూమ్‌లలో హ్యాండ్ డ్రైయర్(Hand dryer)లకు బదులు పేపర్ టవల్స్ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 2015లో వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం(University of Westminster) జెట్ ఎయిర్ డ్రైయర్‌లు, పేపర్ టవల్స్‌పై పరిశోధన చేసింది. ఈ అధ్యయనంలో జెట్ ఎయిర్ డ్రైయర్‌లో ఈస్ట్‌కు చెందిన 59 కాలనీలు కనుగొన్నారు. పేపర్ టవల్(Paper towel)లో ఈ సంఖ్య 6.5 మాత్రమే ఉండటాన్ని గమనించారు. బలమైన గాలి కారణంగా ఈ బ్యాక్టీరియా(Bacteria) ముఖానికి కూడా చేరి, ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తేలింది.
Updated Date - 2023-04-13T08:51:32+05:30 IST