Hansika Motwani: శింబుతో బ్రేకప్.. మరొకరిని ప్రేమించడానికి చాలా ఏళ్లు..
ABN, First Publish Date - 2023-02-19T16:09:08+05:30
బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు.
బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లోని ముంధోతా ఫోర్ట్ ఫ్యాలెస్‌లో ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. శింబు(Simbu) తో బ్రేకప్ అయిన తర్వాత మరొకరిని రెండోసారి ప్రేమించడానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పారు.
‘‘నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ పర్సన్‌ని. కానీ, భావోద్వేగాలను నేను బయటికి వెల్లడించలేను. నాకు పెళ్లి మీద కూడా నమ్మకముంది. నిజం చెప్పాలంటే నేను మరొకరిని ప్రేమించడానికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టింది. సోహైల్ నా జీవితంలోకి వచ్చాక ప్రేమ మీద నాకు మరింత నమ్మకం ఏర్పడింది. నా గత రిలేషన్‌షిప్ ముగిసిపోయినది. ప్రస్తుతం నేను కొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టాను’’ అని హన్సిక తెలిపారు.
హన్సిక వెడ్డింగ్ వీడియో తాజాగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది. ‘లవ్ షాదీ డ్రామా’ (Love Shaadi Drama) టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోలో తన పెళ్లికి సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలను హన్సిక అభిమానులతో పంచుకుంటున్నారు. హన్సిక త్వరగా పెరిగేందుకు ఆమె తల్లి హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చిందనే రూమర్స్ గతంలో హల్‌చల్ చేశాయి. తాజాగా ఆమె ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను ఎనిమిదేళ్లున్నప్పుడే బాల్యనటిగా ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్‌గా మారగానే త్వరగా పెరగడానికి హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకున్నానని ప్రతి ఒక్కరు అన్నారు. నేను 21ఏళ్లున్నప్పుడు ఈ విధమైన చెత్త వార్తలను రాశారు. ఆ రూమర్స్ ఒకవేళ నిజమైతే టాటా, బిర్లా కన్న ధనవంతురాలిగా మారేదానిని. ఇటువంటి వార్తలు రాసేవారికి కామన్ సెన్స్ లేదు. మేం పంజాబీలం. 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య త్వరగా పెరుగుతాం. సెలబ్రిటీగా ఉన్నందుకు నేను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది’’ అని హన్సిక తెలిపారు.
Updated Date - 2023-02-19T16:09:10+05:30 IST