ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: రాత్రివేళ లిఫ్ట్ కోసం బతిమాలిన మహిళ.. వద్దనుకుంటూనే ఆమెను కారులో ఎక్కించుకున్న వ్యాపారి..చివరకు..

ABN, First Publish Date - 2023-10-14T17:59:05+05:30

రాత్రి మహిళ లిఫ్ట్ అడగడంతో జాలిపడ్డ ఓ వ్యాపారి చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అతడి బలహీనతను ఆసరాగా చేసుకుని నిందితులు అతడిని బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా రూ.50 వేలు దోచుకుపోయింది. హర్యానాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: రాబోయే ముప్పును తెలియజేసే ఓ రాడార్ ప్రతిమనిషిలోనూ పనిచేస్తుంటుంది. ఓ పని చేయద్దని మనసు చెబుతున్నప్పుడు చేయకపోవడమే మంచిది. లేకపోతే లేనిపోని అనర్థాల బారినపడాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించిన తాజా ఉదాహరణ హర్యానాలో చోటుచేసుకుంది.

Viral: పట్టెడన్నం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నావ్! ఈ కష్టం ఎవరికీ రాకూడదు బ్రో.. షాకింగ్ వీడియో!

పూర్తి వివరాల్లోకి వెళితే, హర్యానాలోని ఓల్డ్ ఫరీదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఇటీవల ఓ రోజు రాత్రి టీ తాగేందుకు షాపు వద్ద కారు ఆపాడు. ఆ సమయంలో ఓ మహిళ అతడిని సమీపించింది. సెక్టర్ 21 వరకూ తనకు లిఫ్ట్ ఇవ్వమని వేడుకుంది. తొలుత అతడు అంగీకరించలేదు. అయితే, మహిళ మాత్రం అతడిని చాలాసేపు బతిమాలడంతో వ్యాపారి కాదనలేకపోయాడు. ఆమెను కారులో ఎక్కించుకుని ప్రయాణం ప్రారంభించాడు(haryana business man falls prey to honeytrap ends up losing rs 50k).

Viral: వింత వ్యాధి..77 ఏళ్లు వచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోడానికి ఇతడు చెప్పిన కారణం తెలిస్తే..


ఈ క్రమంలో ఆమె వ్యాపారితో మాట కలిపి మచ్చిక చేసుకుంది. ఆ తరువాత అతడితో ఓ బిర్యానీ పొట్లం పార్సెల్ కూడా తెప్పించుకుంది. చివరకు తన ఇంటి వరకూ దిగబెట్టమని కోరడంతో లోంగిపోయిన అతడు ఆమె చెప్పినట్టే చేశాడు. ఆ తరువాత ఇంట్లోకి వెళ్లాక ఆమె అతడిని పూర్తిగా నగ్నంగా మార్చేసింది. అంతా సీక్రెట్‌గా రికార్డు చేసింది. వీడియో రికార్డింగ్ పూర్తయిన వెంటనే ఆమె తన విశ్వరూపం చూపించింది. తాను చెప్పినట్టు చేయకపోతే వీడియో బయటపెడతానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగి అతడి అప్పటికప్పుడు రూ.50 వేలు కూడా వసూలు చేసింది. ఆ సమయంలో అక్కడే దాక్కున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెకు తోడుగా వ్యాపారిని భయభ్రాంతులకు గురి చేశాడు. నిస్సహాయుడైన వ్యాపారి చివరకు వారు అడిగిన మొత్తం చెల్లించకతప్పలేదు.

వారి నుంచి తప్పించుకున్న వ్యాపారి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.

Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..

Updated Date - 2023-10-14T18:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising