30ఏళ్ళకే ముఖం మీద ముడతలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు 50ఏళ్ళు దాటినా సంతూర్ మమ్మీలా కనబడతారు..
ABN, First Publish Date - 2023-07-16T16:48:06+05:30
ఇంటి పట్టునే పైసా ఖర్చు లేకుండా ముఖం మీద ముడుతలు పోగొట్టుకోవచ్చు. ఈ టిప్స్ వల్ల 50ఏళ్ల వయసొచ్చినా సంతూర్ మమ్మీలా కనిపించొచ్చు.
వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ముడుతలు రావడం సహజం. కానీ మరీ 25, 30ఏళ్ళకే ముఖం మీద ముడుతలతో ఆంటీలా కనిపిస్తుంటారు కొందరు. ఈ ముడుతలు తొలగించుకుని అందంగా, యవ్వనంగా కనిపించడానికి చాలా టిప్స్, ఇంకా బోలెడు వాణిజ్య ఉత్పత్తులు కూడా వాడుతుంటారు. కానీ అవి అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. అయితే ఇంటి పట్టునే పైసా ఖర్చు లేకుండా ముఖం మీద ముడుతలు పోగొట్టుకోవచ్చు. ఈ టిప్స్ వల్ల 50ఏళ్ల వయసొచ్చినా సంతూర్ మమ్మీలా కనిపించొచ్చు. ఇవి చాలా తొందరగా ఫలితాలను ఇస్తాయి కూడా. ఇంతకీ అంత పవర్ఫుల్ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
ముడుతలు(Wrinkles) ముఖ్యంగా పొడి చర్మం(dry skin) వారికే చాలా తొందరగా వస్తుంటాయి. ఇలా పొడి చర్మం ఉన్నవారు అరస్పూన్ నువ్వుల నూనెను(sesame seed oil) రెండు స్పూన్ల పాలలో(Milk) కలపి బాగా మిక్స్ చేయాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. సుమారు 15నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని నీళ్ళలో ముంచిన మెత్తని వస్త్రం లేదా కాటన్ బాల్ తో తుడవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ముడుతలు చాలా తొందరగా తగ్గుతాయి.
ముడుతలు తగ్గించుకోవడానికి మరొక గొప్ప మార్గం తేనె, కీరదోసకాయ(honey, cucumber). కీరదోసకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిపోయిన తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. దోసకాయ రసంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్-ఎ, ఇ ఉంటాయి. ఇవి ముడుతలు తొలగించడంలో సహాయపడతాయి. తేనె చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
Viral Video: బాగా ఆకలిగా ఉన్న చిరుత వేట ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే గుండెలు అదురుతాయి..
ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు బాదం నూనెతో(Almond oil) ముఖానికి కనీసం 10నిమిషాల సేపు మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం మీద ముడుతలే కాదు, మచ్చలు, గుంటలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. స్పాట్ లెస్ స్కిన్(spot less skin) సొంతమవుతుంది.
బొప్పాయిలో(papaya) యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం నుండి మృతకణాలను తొలగించి ముఖానికి మెరుపును ఇస్తాయి. ముఖం మీద ముడుతలను తగ్గిస్తాయి. ఇందుకోసం బొప్పాయిని పేస్ట్ చేసి ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. ఆరిపోయిన తరువాత సాధారణ నీటితో కడిగేయాలి.
అరటిపండు(banana) ముడుతలు పోగొట్టడం వెనుక కారణం ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ కొల్లాజెన్ చర్మానికి ఎలాస్టిక్ గుణాన్ని పెంచుతుంది. రోజువారీ ఆహారంలో అరటిపండు తీసుకుంటూ ఉంటే మంచిది. అలాగే అరటిపండును మెత్తని పేస్ట్ లాగా చేసి అందులో కొంచెం తేనె కలపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తూంటే ముఖం మీది ముడుతలు మంత్రమేసినట్టు మాయమవుతాయి.
Health Tips: బరువు తగ్గుతామనే భ్రమలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో తెలుసా? ఉదయాన్నే అందరూ తాగే ఈ డ్రింక్స్ వల్లనే..
Updated Date - 2023-07-16T16:48:06+05:30 IST