ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: అరటిపండ్ల నుంచి ఆరెంజ్ వరకు.. ఈ 4 రకాల పండ్ల తొక్కలను పారేస్తే బ్లండర్ మిస్టేక్ చేస్తున్నట్టే లెక్క.. వాటితో..!

ABN, First Publish Date - 2023-12-01T14:33:11+05:30

అందరూ పండ్లు తింటారు తొక్కలు పడేస్తారు. మరికొందరు ఈ తొక్కలను మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తారు. కానీ వాటిని ఇలా కూడా ఉపయోగించవచ్చు.

అందరూ పండ్లు తింటారు తొక్కలు పడేస్తారు. తెలివైనవారు పర్యావరణం మీద స్పృహ ఉన్నవారు ఈ తొక్కలను మొక్కలకు ఎరువుగా ఉపయోగించి మొక్కలను ఆరోగ్యంగా పెంచడానకి ప్రయత్నిస్తారు. అయితే పండ్ల తొక్కలతో అలాగ ఇలాగ కాదు.. ఏకంగా అందాన్ని తళుక్కుమనిపించవచ్చు. ఇందుకోసం అరటిపండ్ల నుండి ఆరెంజ్ తొక్కల వరకు ఏకంగా నాలుగు రకాల పండ్ల తొక్కలు వినియోగించవచ్చు. వేల రూపాయలు పోసి అందం కోసం ఆరాటపడటం కంటే తొక్కలతోనే మ్యాజిక్ చెయ్యవచ్చు(fruit peels for beauty). ఈ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెసుకుంటే..

అరటి తొక్కలు..(banana peels)

అరటిపండు తొక్కలు యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి ముఖం మీద మచ్చలు, ముడతలు తొలగించడంలో సహాయపడతాయి. అరటి తొక్కలను చిన్నముక్కలుగా కట్ చేయడం లేదా మిక్సీ వేయాలి. దీంట్లో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15-20నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ 8 కూరగాయలను.. ఇంట్లో ఉండే గార్డెన్‌లోనూ పెంచొచ్చు..!


ఆపిల్ తొక్కలు..(Apple peels)

ఆపిల్ తొక్కలను ఉపయోగించడం గురించి ఇప్పటి వరకు విని ఉండరు. ఆపిల్ తొక్కలతో టోనర్ తయారుచేసుకోవచ్చు. గ్లాసు నీటిలో ఆపిల్ తొక్కలు వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరువాత స్ప్రే బాటిల్ లో వేసి భద్రపరచాలి. దీన్ని ముఖానికి స్ప్రే చేసి కాటన్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ చర్మం బిగుతుగా మారడంలో సహాయపడుతుంది.

బొప్పాయి తొక్కలు..(papaya peels)

బొప్పాయి తొక్కలు అందం కోసం అనే మాట వింటే అవాక్కవుతారేమో. కానీ దీని ఫలితాలు కూడా అవాక్కయ్యేలా చేస్తాయి. వీటిలో ఎంజైమ్ లు చర్మం మీద మృత కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ట్యానింగ్ ను తగ్గిస్తాయి. బొప్పాయి తొక్కలను కడిగి, శుభ్రం చేసి వాటిని మిక్సీ వేసి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ ను వారానికి ఒకసారి అప్లై చేస్తే చర్మం క్లిస్టర్ క్లియర్ గా మారుతుంది.

నారింజ తొక్కలు..(orange peels)

నారింజ తొక్కలు ఎప్పటినుండో సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. వీటిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. నారింజ తొక్కలను ఉపయోగించడం వల్ల చర్మం మీద మచ్చలు, మృత కణాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలు గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ఉపయోగించవచ్చు. లేదంటే నారింజ తొక్కల పొడి కూడా ఉపయోగించవచ్చు. నారింజ తొక్కల పొడిలో తేనె, పెరుగు వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ముఖంలో గ్లో వస్తుంది.

(గమనిక: ఈ సమాచారం చర్మ సంరక్షణ నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడింది. ఏవైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

ఇది కూాడా చదవండి: Curry Leaves: పొద్దున్నే నాలుగు కరివేపాకు రెమ్మలను పరగడుపున నమిలితే.. ఆ సమస్య అసలు రానే రాదు..!


Updated Date - 2023-12-01T14:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising