Health Facts: తక్కువ వయసులోనే చనిపోకూడదని అనుకుంటున్నారా..? ఎక్కువ కాలం బతకాలంటే అసలేం చేయాలంటే..!
ABN, First Publish Date - 2023-11-01T14:58:10+05:30
చిన్న వయసులో చనిపోకూడదన్నా, జీవితకాలాన్ని పొడిగించుకోవాలన్నా నడవాల్సింది 10వేల అడుగులు కాదని నడక గురించి చేసిన పరిశోధనలు చెబుతున్నాయి..
నడక అద్భుతమైన వ్యాయామం. ప్రతిరోజూ నిర్దేశిత నడక అన్ని రకాల జబ్బుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ప్రతిరోజూ 10వేల అడుగులు వాకింగ్ చేస్తే అధిక బరువు సమస్య పరిష్కారం కావడమే కాకుండా ఆరోగ్యపరంగా బోలెడన్ని లాభాలుంటాయంటారు. ప్రతిరోజూ వాకింగ్ చేసేవారు తమ జీవితకాలాన్ని పెంచుకుంటున్నట్టేనని పరిశోధకులు చెబుతూ వచ్చారు. అయితే చిన్న వయసులో చనిపోకూడదన్నా, జీవితకాలాన్ని పొడిగించుకోవాలన్నా నడవాల్సింది 10వేల అడుగులు కాదని నడక గురించి పరిశోధనలు చేసిన వైద్యులు చెబుతున్నారు. అసలు దీర్ఘకాలం జీవించాలంటే రోజు ఎంత దూరం నడవాలి? దీని వెనుక గల కారణాలు ఏమిటి? తెలుసుకుంటే..
ప్రతిరోజూ 10వేల అడుగుల(10thousand steps)టార్గెట్ పెట్టుకుని నడిచేవారు ఉన్నారు. దీనివల్ల అధికబరువుతో సహా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అంటారు. కానీ ఎక్కువ కాలం జీవించాలన్నా ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ప్రతిరోజూ 2700అడుగులు(daily 2700steps for long live) వేస్తే సరిపోతుందట. అంటే రోజుకి 2కి.మీ దూరం నడిస్తే చిన్నవయసులోనే చనిపోయే ప్రమాదాలు, గుండెపోటు వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. తక్కువ వ్యాయామం చేసి ఎక్కువ ఆరోగ్య లాభాలు పొందే మార్గం ఇదని అంటున్నారు. దీనివల్ల శరీరానికి వాటిల్లే వ్యాధుల ప్రమాదం 60శాతం తగ్గుతుంది. 2700 అడుగులు నడిచేవారిలో కార్డియోవాస్క్యులర్ ప్రమాదం 11శాతం తక్కువగా ఉందని తేలింది. అయితే గుండె సంబంధ సమస్యలకు అవకాశం ఉన్నవారు ప్రతిరోజూ 7వేల అడుగులు వేయడం వల్ల గుండె వ్యాధుల ప్రమాదాన్ని 51శాతం తగ్గించవచ్చని తేలింది.
Viral News: మీరు ఈ కంపెనీలో చేరి పదేళ్లు పూర్తయిందంటూ.. యాపిల్ కంపెనీ ఇచ్చిన గిఫ్టును చూసి అంతా షాక్..!
రోజుకు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అనే మాట జపాన్ లో పుట్టిందని చెబుతున్నారు. 1964లో టోక్యో ఒలింపిక్స్ సమయంలో జపనీస్ మార్కెట్ ప్రచారం కోసం 10వేల అడుగులను ఉపయోగించారు. ఈ అంకెలో ఉన్న ఆకర్షణ కారణంగా ఇది ఏళ్ళ తరబడి ఆదరణ పొందుతూ వచ్చింది. అయితే 2700 అడుగుల కంటే ఎక్కువ నడవడం వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. నడిచే ప్రతి 500 అడుగులకు వారికి లభించే ఫలితాలు మెరుగ్గానే ఉంటాయి. కానీ 2700అడుగుల వల్ల కలిగే ఫలితాలకు, 10వేల అడుగులు, 16 వేల అడుగులు ఇలా ఎంత నడిచినా కలిగే ఫలితాలు మాత్రం పెద్దగా తేడాగా ఉండవనే ఆశ్చర్యకరమైన విషయాన్ని పరిశోధకులు వెల్లడించారు.
కేవలం వాకింగ్ మాత్రమే కాదు. దీర్ఘకాలం జీవించాలన్నా, చిన్నవయసులోనే రోగాల బారిన పడకూడదన్నా ఆహారంలో ఎక్కువ భాగం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. కొవ్వులు కలిగిన ఆహారం తక్కువ తినాలి. ఆరోగ్యకరమైన కొవ్వులున్న ఆహారాన్ని ఎంపికచేసుకోవాలి. ఉప్పు, చక్కెర, పులుపు మితంగా తీసుకోవాలి.
ధూమపానం అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి దాన్ని మానేస్తే బోలెడు రోగాలను దూరం పెట్టినట్టే.
ఆరోగ్యంగా ఉండడానికి మంచి నిద్ర ఎంతో ముఖ్యం. కాబట్టి రోజూ కనీసం 7నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర సరిగా లేకపోతే అది జీవక్రియ మీద ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను, శరీరంలో మోటార్ నైపుణ్యాన్ని, ఒత్తిడి హార్మోన్లను, గుండె ఆరోగ్యాన్ని నిద్ర సరిగా లేకపోవడం ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పాడు చేస్తుంది.
Police Tweet: పోలీసులతోనే ఆటలా..? తెలివిగా షాకిచ్చారుగా.. సుఖం లేకుండా పోయిందంటూ ఓ యువతి ట్వీట్ చేయగానే..!
Updated Date - 2023-11-01T15:08:39+05:30 IST