ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: ఎంత నిద్రపోదామన్నా అస్సలు నిద్రపట్టదు.. ఈ సమస్యకు అసలు కారణం ఇదే..

ABN, First Publish Date - 2023-10-22T13:32:28+05:30

రాత్రవ్వగానే పక్కమీద వాలడం, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లడం, ఏవేవో ఆలోచన చెయ్యడం ఇలా గంటలు గంటలు గడపడం.. ఇదంతా నిద్రలేమి సమస్యే.. దీనికి అసలు కారణం ఈ లోపమే..

నిద్ర గొప్ప ఔషదం అని అంటారు. ప్రతి రోజూ మంచి నిద్ర ఉంటే సగం రోగాలను నయం చేసుకున్నట్టే. కానీ దురదృష్టవశాత్తు చాలామంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. రాత్రవ్వగానే పక్కమీద వాలడం, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లడం, ఏవేవో ఆలోచన చెయ్యడం ఇలా గంటలు గంటలు గడిపి ఎప్పుడో తెల్లవారు జామున రెండు లేదా మూడు గంటప్పుడు నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. అయితే ఇలా నిద్ర పట్టకపోవడానికి అసలు కారణం విటమిన్ లోపమట. అసలు ఏ విటమిన్ లోపం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది? దీన్ని అధిగమించడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే..

ఆరోగ్యనిపుణులు నిద్రలేమి(insomnia) సమస్యకు విటమిన్ లోపం ప్రధాన కారణం అని చెబుతున్నారు. విటమిన్-డి(Vitamin-D) లోపం వల్ల కలత నిద్ర, నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం, నిద్ర సమయంలో అసహనం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. నిద్ర చక్కగా పట్టాలంటే మెలటోనిన్(melatonin) హార్మోన్ సరిపడినంత స్థాయిలో ఉండాలి. శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తికి విటమిన్-డి ప్రధాన వనరు. శరరంలో విటమిన్-డి లోపించినప్పుడు నిద్ర హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు తీవ్రమైన అసహనం, అసౌకర్యం ఏర్పడుతుంటుంది. ఎందుకంటే నిద్ర సరిగా లేకపోతే శరీరంలో నాడీవ్యవస్థ విశ్రాంతి తీసుకోవడం జరగదు.

Mobile Phone: ఫోన్ పనిచేయకుంటే సర్వీస్ సెంటర్లో ఇవ్వడం మాములే.. కానీ ఈ 5 జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు..



నిద్రలేమికి విటమిన్-డి లోపమే కాకుండా మరొక కారణాన్ని కూడా వైద్యులు సూచించారు. శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల(happy hormones) ఉత్పత్తి పెరిగితే శరీరం ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఈ కారణంగా సరిగా నిద్రపోలేరు. నిద్రలేమి సమస్యను అధిగమించడానికి, విటమిన్-డి లోపాన్ని భర్తీ చేయడానికి విటమిన్-డి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి(vitamin-D rich foods). ఉదయం, సాయంత్రం సూర్యరశ్మిలో కొద్దిసేపు గడపాలి. పుట్టగొడుగులు , గుడ్లు, సోయా మిల్క్, బాదం మిల్క్, నారింజ రసం, సముద్రపు ఉత్పత్తులు మొదలైన ఆహారాలు తప్పకుండా తీసుకుంటూ ఉంటే విటమిన్-డి లోపం పరిష్కారమై మంచి నిద్ర పడుతుంది.

White Hair: తెల్లజుట్టు కవర్ చేయడానికి పదే పదే హెన్నా పెట్టినా పెద్దగా ఫలితం లేదా? ఒక్కసారి హెన్నాలో ఇది కలిపి వాడితే..


Updated Date - 2023-10-22T13:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising