Transgender Day: ట్రాన్స్‌జెండర్ అని తెలిసి ముఖంపై పిడిగుద్దులు.. బ్యాగ్ రోడ్డు మీదకు విసిరేశారు.. ఉద్యోగం నుంచి తీసేశారు.. ఇప్పుడు..
ABN, First Publish Date - 2023-03-31T13:03:51+05:30
ప్రపంచంలోని అనేక దేశాలలో ట్రాన్స్ వ్యక్తులు చాలా కాలంగా ఉన్నారు.
అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 31న నిర్వహిస్తున్నారు. లింగమార్పిడి చేయించుకున్నవారు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన పెంచడం, వారు సమాజానికి చేసిన కృషిని గుర్తిచేసుకోవడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.
నెకో బ్రోచి ట్రాన్స్ ఉమెన్.. లింగమార్పిడి ద్వారా తను మారాకా ఒక్కసారిగా సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంది. అంతే కాకుండా ఉద్యోగాన్ని కూడా కోల్పోయింది. మతోన్మాదం, వివక్షతో బ్రోచి బ్యోగ్‌ని వీధిలోకి విసిరి మరీ వ్యతిరేకించాడు ఆమె యజమాని. గత ఐదేళ్లుగా బ్రిస్బేన్‌లో బ్రోచి నివసిస్తుంది. ఉద్యోగాన్ని కోల్పోవడం అంటే అంత సులభం కాదు. ఇష్టపడే ఉద్యోగాన్ని ఎందుకు కోల్పోవాలి. కానీ దీనింతకీ బ్రోచి లింగ మార్పిడి చేయించుకోవడమే ప్రధాన కారణంగా నిలిచింది.
విషయంలోకి వెళితే..
28 సంవత్సరాల బ్రోచి ఒక సామాజిక కార్యకర్తగా, మానవ హక్కుల న్యాయవాదిగా తన చదువును కొనసాగిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ కమ్యునిటీకి న్యాయవాదిగా కావడమే ఆమె ముందున్న లక్ష్యం. దీనివెనుక బ్రోచి పొందిన అవమానాలు, వివక్ష ఉన్నాయి. తనతోపాటు తనలాంటి లింగమర్పిడి చేయించుకుని వివక్షకు గురి అవుతున్న వారి తరపున వాదించేందుకు బ్రోచి న్యాయవాదిగా నిలబడాలనే సంకల్పంతో ఉంది.
డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన కొత్త చట్టం ప్రకారం, ట్రాన్స్, జెండర్ విభిన్న వ్యక్తులు లింగ మార్పును నమోదు చేసుకోవడానికి ఇకపై లైంగిక పునర్వ్యవస్థీకరణ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని తీర్పును ఇచ్చింది.
ఇది కూడా చదవండి: సిజేరియన్ తర్వాత తల్లి, శిశువుకు ఎప్పుడు పాలివ్వాలంటే.. ?
ట్రాన్స్ జండర్స్ హక్కులను మెరుగుపరచడానికి అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ కమ్యూనిటీ అణచివేతకు గురవుతూనే ఉంది. అమెరికాలో రాష్ట్రాలలో, ట్రాన్స్ వ్యక్తులు పరివర్తన చెందడం కష్టతరం చేయడానికి వారి చట్టాలను తారుమారు చేస్తుంది. దీనిమీద అసహనం, హింసకు దారితీసిందని, ఇటీవల సిడ్నీ వరల్డ్ ప్రైడ్‌లో ఎన్నో ఆందోళనులు కూడా జరిగాయి.
ఇలాంటి వారు యుగయుగాలుగా ఉన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాలలో ట్రాన్స్ వ్యక్తులు చాలా కాలంగా ఉన్నారు. శ్రీలంక వారసత్వం నుండి వచ్చిన వ్యక్తిగా చెప్పాలంటే, 2,000 సంవత్సరాలకు పైగా ట్రాన్స్ గర్ల్స్‌ను ఉన్నారు. లింగమార్పిడి చేయించుకున్న వారిపై చూపే వివక్షే తనను మానసిక దృక్పథాన్ని మార్చుకునేలా చేసిందని చెప్పుకొచ్చింది బ్రోచి.
Updated Date - 2023-03-31T13:03:51+05:30 IST