Reliance: రిలయన్స్ సంస్థలో అత్యధిక శాలరీ ఈయనదే! ఐఐటీ చదువులేదు.. సీఈఓ కూడా కాదు! అయినా..
ABN, First Publish Date - 2023-07-20T21:13:10+05:30
రిలయన్స్‌లో ముఖేశ్ అంబానీ తరువాత అత్యధిక శాలరీ పొందిన వ్యక్తిగా నిఖిల్ మెస్వానీ. సంస్థ బోర్డులో ఆయన కూడా సభ్యుడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బడా కార్పొరేట్ సంస్థలంటే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్(Reliance Industries). అదో మహావ్యాపార సామ్రాజ్యం. రిలయన్స్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.14.63 ట్రిలియన్లు. అంతటి సామ్రాజ్యానికి అధిపతి ముఖేశ్ అంబానీ(Mukesh Ambani). ముఖేశ్ అంబానీకే సంస్థలో అత్యథిక పారితోషికం ఉంటుంది. ఇందులో వింతేంలేదు. అయితే, ఆ సంస్థలో ముఖేశ్ తరువాత అత్యధిక శాలరీ పొందేది ఎవరు(Highest Paid Employee)? శాలరీ ఎంత అనే డౌటు ఈపాటికి చాలా మందికి వచ్చే ఉంటుంది. ముఖ్యంగా, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థల సీఈఓల శాలరీలు తరచూ వార్తల్లో నిలుస్తున్నప్పుడు మన భారతీయ సంస్థల ఆలోచన మదిలో మెలగక తప్పదు. సంస్థకు సీఈఓ కూడా కాని ఆయన అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారంటే మాత్రం ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
రిలయన్స్ అంతటి భారీ సంస్థను నిర్వహణ కోసం సంస్థ అధిపతికి నమ్మకస్తులైన వ్యక్తులు అవసరం. అలాంటి వారే నిఖిల్ మెస్వానీ(Nikhil Meswani). సంస్థలో అత్యధిక పారితోషికం పొందిన రికార్డు ఆయనదే. 1989లో నిఖిల్ రిలయన్స్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి రిలయన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అంతేకాదు.. ముఖేశ్‌కు ఆయన బంధువు కూడా. కెమికల్ ఇంజినీర్ అయిన నిఖిల్ రిలయన్స్‌లో చేరిన రెండు సంవత్సరాలకు ఫుల్ టైం డైరెక్టర్ అయ్యారు. ఆ తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు చేప్టటారు. ప్రస్తుతం రిలయన్స్ బోర్డు సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు.
ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిఖిల్ ఆ తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1997 నుంచి 2005 మధ్య ఆయన రిలయన్స్ రిఫైనరీల నిర్వహణను చూసుకున్నారు. రిలయన్స్‌కు అత్యంత కీలకమైన పెట్రో కెమికల్స్ వ్యాపారం బాధ్యతలను ముఖేశ్ నిఖిల్‌కు అప్పగించారు. అన్నట్టు, ముఖేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ ఐపీఎం క్రికెట్ టీం బాధ్యతలు కూడా ఆయనవే.
అయితే, 2021-22 సంవత్సరంలో ఆయన ఏకంగా రూ.24 కోట్ల పారితోషికం తీసుకున్నారు. సంస్థలో అత్యధిక శాలరీ తీసుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అనంతరం సంభవించిన కరోనా సంక్షోభం కారణంగా ముఖేశ్ అంబానీ తాను శాలరీ తీసుకోనని ప్రకటించారు. ఫలితంగా మిగతా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల పారితోషికం కూడా కొంత మేర తగ్గిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.
Updated Date - 2023-07-20T21:16:20+05:30 IST