ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-07-03T07:15:46+05:30

నేడు (3-7-2019 - సోమవారం) దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు బాగానే ఉన్నాయి. సింహరాశి వారు మాత్రం నేడు ఒక గుడ్ న్యూస్ అందుకుంటారట. అంటే.. ఏదైనా ఇంటర్వ్యూకి హాజరైతే తప్పనిసరిగా సత్ఫలితం సాధిస్తారట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు (3-7-2019 - సోమవారం) దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు బాగానే ఉన్నాయి. సింహరాశి వారు మాత్రం నేడు ఒక గుడ్ న్యూస్ అందుకుంటారట. అంటే.. ఏదైనా ఇంటర్వ్యూకి హాజరైతే తప్పనిసరిగా సత్ఫలితం సాధిస్తారట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు అందుకుంటారు.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, ఆడిటింగ్‌ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. అంచనాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పొదుపు పథకాలు, చిట్‌ఫండ్‌లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. పెన్షన్‌ బీమా, గ్యాట్యుటీ లావాదేవీలకు అనుకూలం. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఫీజులు చెల్లిస్తారు. గతించిన సన్నిహితులను స్మరించుకుంటారు. రుద్రకవచ పారాయణ మంచిది.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకలు, ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాలకు అనుకూలం. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, హోటల్‌ రంగాల వారు శుభవార్త అందుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులకు శుభప్రదం. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్‌ వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. రియల్‌ ఎస్టేట్‌; నిర్మాణ రంగాల వారు కొత్త పథకాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సంకల్పం ఫలిస్తుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. విద్యార్థులకు శుభప్రదం. రవాణా, బోధన, ఏజెన్సీ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరం. కమ్యూనికేషన్‌ రంగంలోని వారికి లాభిస్తుంది. శుభవార్త అందుకుంటారు.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఆర్థిక అంశాలు చర్చకు వస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన లక్ష్య సాధనకు అనుకూల సమయం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ప్రముఖుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో వినూత్న ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధిఆ్తరు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. గౌరవ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో పేరు తెచ్చుకుంటారు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉత్సవాలు, ప్రదర్శనలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, రక్షణ, రవాణా రంగాల వారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. గోసేవ మంచిది.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పన్నులు, బీమా, వైద్యం కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. షాపింగ్‌, క్రయవిక్రయాలకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. శివాలయాన్ని దర్శించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-07-03T07:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising