ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-08-22T08:30:14+05:30

నేడు (22-8-2023 - మంగళవారం) మీనరాశి వారు వైద్యం, ఫార్మా,ఫైనాన్స్‌ రంగాల వారు ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటక రాశి వారికి సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఇక సింహ రాశివారికి ఓ విషయంలో నిదానంగా వ్యవహరించాలని సూచన చేయడం జరిగింది. ఇక అన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేడు (22-8-2023 - మంగళవారం) మీనరాశి వారు వైద్యం, ఫార్మా,ఫైనాన్స్‌ రంగాల వారు ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటక రాశి వారికి సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఇక సింహ రాశివారికి ఓ విషయంలో నిదానంగా వ్యవహరించాలని సూచన చేయడం జరిగింది. ఇక అన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణాలు మంజూరవుతాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. వడ్డీలు, బకాయిలు చేతికి అందుతాయి. బ్యాంకు లావాదేవీలు పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్పెక్యులేషన్లు, రియల్‌ ఎస్ట్టేట్‌ లావాదేవీల్లో కాస్త నిదానం పాటించడం మంచిది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి శుభవార్త అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. హోటల్‌, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. వృత్తి పరమైన ప్రయాణాలకు అనుకూలం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. క్రీడలు, టెలివిజన్‌, బ్యాంకింగ్‌ రంగాల వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఆనందకరమైన సమాచారం అందుకుంటారు. మార్కెటింగ్‌, స్టేషనరీ, రవాణా, కమ్యూనికేషన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో కొంత నిదానం పాటించడం మంచిది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం మంచిది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఖ ర్చు చేస్తారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పదిమందిని కలుపుకుని మంచి కార్యక్రమం గురించి ఆలోచిస్తారు. పెట్టుబడులు, స్టాక్‌మార్కెట్‌ లావాదేవాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారి సహకారం లభిస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులు ఆటంకాలను అధిగమించి పూర్తి చేయగలుగుతారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు సాంత్వన కలిగిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాదన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలుకు అనుకూలం. రుణాలు మంజూరవుతాయి. పెన్షన్‌, గ్రాట్యుటీ, మెడికల్‌ క్లెయిములు పరిష్కారం అవుతాయి. అడ్వాన్సులు, రుణాలు అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు భాగస్వామి సహకారం లభిస్తుంది. వివాహ నిర్ణయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

వైద్యం, ఫార్మా,ఫైనాన్స్‌ రంగాల వారు ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెన్షన్‌, గ్రాట్యుటీ, పన్నుల వ్యవహారాలు పూర్తవుతాయి. మెడికల్‌ కె ్లయిములు, మంజూరవుతాయి. సహోద్యోగుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-08-22T08:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising