Horoscope : రాశిఫలాలు
ABN, First Publish Date - 2023-09-08T08:02:53+05:30
నేడు (8-9-2023 - శుక్రవారం) ఆర్థిక సంస్థలకు చెందిన వృషభ రాశివారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉన్న మిథునరాశి వారికి నేడు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక సింహరాశి వారు సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు
నేడు (8-9-2023 - శుక్రవారం) ఆర్థిక సంస్థలకు చెందిన వృషభ రాశివారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉన్న మిథునరాశి వారికి నేడు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక సింహరాశి వారు సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రతి ఒక్కరి రాశి ఫలితం నేడు చాలా బాగుంది. అయితే దాదాపు ప్రతి ఒక్కరికీ సూచన చేయడం జరిగింది. అదేంటో తెలుసుకుని ఫాలో అయిపోండి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. మెయిల్స్, మెసేజ్లు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాల కొనుగోలుకు అనుకూలం. లక్ష్మీదేవిని ఆరాధించండి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక సంస్థలకు చెందిన వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ మనసు మార్పును కోరుకుంటుంది. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన ఆలోచన ఒక కొలిక్కి వస్తుంది. కనకధారా స్త్రోత్ర పారాయణ మంచిది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. విరామ కాలక్షేలపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి. దీర్ఘకాలంగా వాయుదా పడుతున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ, సినీరంగాల వారికి శుభప్రదం. లలితా దేవి ఆరాధన మంచిది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల వారికి ఆర్థికంగా పో త్ర్సాహకరంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కమ్యూనికేషన్లు, న్యాయ, రక్షణ, బోధన, ఆడిటింగ్, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సోదరీ సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వాహనయోగం వుంది. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెట్టబడులు లాభిస్తాయి. పన్నులు, బీమా పథకాల చెల్లింపులకు నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూరవుతాయి. మెడికల్ క్లెయిముల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. దుర్గాష్టక పారాయణ చేయండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బ్యాంకులు, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణమాలు సంభవం. వేడుకల్లో బంధుమిత్రులు, ప్రియతములను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, హోటల్, ఔషధ రంగాల వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమలు ఫలిస్తాయి. చిన్నారులు, ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులు లాభిస్తాయు. పన్నులు, చిట్ఫండ్లు, పొదుపు పథకాల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులు, హార్డ్వేర్ రంగాల వారికి శుభప్రదం. లలితాదేవి ఆరాధన మంచిది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - 2023-09-08T08:07:50+05:30 IST