ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Horoscope : రాశిఫలాలు

ABN, First Publish Date - 2023-08-01T07:27:11+05:30

నేడు (1-8-2019 - మంగళవారం) మేషరాశి వారికి షాపింగ్‌, క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. మిథున రాశి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇక కొన్ని రాశుల వారికి ఓ సూచన చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అది ఫాలో అయితే ఇంకా మంచి జరుగుతుందట. ఆ రాశులేంటో.. ఏం సూచన చేయడం జరిగిందో ఒకసారి చూద్దాం.

నేడు (1-8-2019 - మంగళవారం) మేషరాశి వారికి షాపింగ్‌, క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. మిథున రాశి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇక కొన్ని రాశుల వారికి ఓ సూచన చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అది ఫాలో అయితే ఇంకా మంచి జరుగుతుందట. ఆ రాశులేంటో.. ఏం సూచన చేయడం జరిగిందో ఒకసారి చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

క్రీడలు, ఆడిటింగ్‌, టెలివిజన్‌, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌, క్రయవిక్రయాలకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు అందుకుంటారు.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, ఆడిటింగ్‌ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. అంచనాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పొదుపు పథకాలు, చిట్‌ఫండ్‌లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. పెన్షన్‌ బీమా, గ్యాట్యుటీ లావాదేవీలకు అనుకూలం. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఫీజులు చెల్లిస్తారు. గతించిన సన్నిహితులను స్మరించుకుంటారు. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ మంచిది.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకలు, ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాలకు అనుకూలం. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, హోటల్‌ రంగాల వారు శుభవార్త అందుకుంటారు. సన్నిహితు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులకు శుభప్రదం. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్‌ వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. రియల్‌ ఎస్టేట్‌; నిర్మాణ రంగాల వారు కొత్త పథకాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సంకల్పం ఫలిస్తుంది.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. విద్యార్థులకు శుభప్రదం. రవాణా, బోధన, ఏజెన్సీ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరం. కమ్యూనికేషన్‌ రంగంలోని వారికి లాభిస్తుంది. శుభవార్త అందుకుంటారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఆర్థిక అంశాలు చర్చకు వస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన లక్ష్య సాధనకు అనుకూల సమయం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రముఖుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో వినూత్న ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధిఆ్తరు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. గౌరవ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో పేరు తెచ్చుకుంటారు.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉత్సవాలు, ప్రదర్శనలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, రక్షణ, రవాణా రంగాల వారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. గోసేవ మంచిది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-08-01T07:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising