ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Loss: జుట్టు పలచబడుతోందా..? నిర్జీవంగా మారిందా.. ఇలా ఒక్కసారి చేస్తే..

ABN, Publish Date - Dec 22 , 2023 | 07:15 PM

జుట్టు ఒత్తుగా మారేందుకు బయోటిన్ విటమిన్ చాలా కీలకం. దీన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ కథనంలో చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: జుట్టు పలచబడటం.. బట్టతల రావడం..అనేక మందిని వేధించే సమస్య ఇది. దీనికి పరిష్కారంగా మార్కెట్లో ఎన్నో బ్యూటీ సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, జుట్టు రాలడం ఆపేందుకు విటమిన్ బీ7 ఎంతో కీలకం. బ్యాలెన్స్ డైట్ తీసుకునేవారికి ఈ విటమిన్ లోపం ఉండదు. అయితే, వైద్యులు చాలా సందర్భాల్లో జుట్టు రాలేవారికి ఈ విటమిన్‌ను సూచిస్తుంటారు. ఈ విటమిన్ కణాల పెరుగుదలకు చాలా కీలకం. శరీరంలో ఇది తగినంత మోతాదుల్లో అందుబాటులో ఉంటే కుదుళ్ల బలపడి జట్టు పలచబడటం తగ్గిపోతోంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..బయోటిన్ పౌడర్‌ను ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. క్రమంగా తప్పకుండా దీన్ని తీసుకుంటే సమస్యలన్నీ తొలగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి బయోటిన్ పౌడర్ (Biotin Powder) ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి (How to make Biotin powder at home).


కావాల్సినవి

  • అర కప్పు బాదం పప్పు, వేరుసెనగ, వాల్‌నట్స్

  • అర కప్పు ఓట్స్ లేదా బార్లీ

  • అర కప్పు పెసర పప్పు, సెనగ పప్పు

  • అర కప్పు చియా గింజలు

  • అర కప్పు అవిసె గింజలు

  • అర కప్పు షిఫ్ బోన్ పౌడర్ (శాకాహారులకు ఇది అవసరం లేదు)

తయారీ విధానం

ముందుగా బాదం పప్పు, వేరు సెనగ, పొద్దుతిరుగుడు గింజలు, వాల్‌నట్స్ వంటివి మిక్సీలో వేసి పొడి చేయాలి. ఆ తరువాత ఓట్స్, బార్లీ వేసి మెత్తగా పొడిచేయాలి. అనంతరం, పెసర, సెనగ పప్పును కూడా వేసి మెత్తగా తిప్పాలి. చివరిగా అవిసె గింజలు వేసి మెత్తటి పొడి వచ్చేలా మిక్సీలో తిప్పాలి. ఇలా వచ్చిన పొడిని ఓ చిన్న డబ్బాలు పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.

ఇలా సిద్ధం చేసుకున్న బయోటిన్ పౌడర్‌ను టీ లేదా స్మూదీల్లో వేసుకోవచ్చు. లేదా నేరుగా గోరువెచ్చటి నీటిలో ఓ స్పూన్ పౌడర్ వేసుకుని తాగొచ్చు. ప్రతి రోజూ ఇలా చేస్తే శరీరానికి అవసరమైన బయోటిన్ పూర్తి స్థాయిలో అందుతుంది. హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గి, ఒత్తైన జుట్టు వస్తుంది. అయితే, విటమిన్ సప్లిమెంట్ల విషయంలో ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఇవి తీసుకోవాలి.

Updated Date - Dec 22 , 2023 | 07:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising