Viral News: స్కై డైవింగ్‌లో భారత మహిళ న్యూ రికార్డ్.. ఏకంగా 21వేల అడుగులపైనుంచి దూకి హిస్టరీ
ABN, First Publish Date - 2023-11-15T17:10:53+05:30
Skydiver: స్కైడైవింగ్‌లో భారత మహిళ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున్న ఓ పర్వతంపై నుంచి దూకి చరిత్ర సృష్టించారు. దీంతో స్కైడైవింగ్(Skydiving)లో ఇప్పటివరకున్న రికార్డులన్నీ చెరిపేశారు.
ఢిల్లీ: స్కైడైవింగ్‌లో భారత మహిళ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున్న ఓ పర్వతంపై నుంచి దూకి చరిత్ర సృష్టించారు. దీంతో స్కైడైవింగ్(Skydiving)లో ఇప్పటివరకున్న రికార్డులన్నీ చెరిపేశారు. పద్మశ్రీ(PadmaSri Award) అవార్డు గ్రహిత అయిన శీతల్ మహాజన్(Sheetal Mahajan) గతంలోనూ చాలా పర్వతాలపై నుంచి స్కైడైవింగ్ చేసి రికార్డులు నెలకొల్పారు.
ఎప్పటికైనా ఎవరెస్ట్ అంత ఎత్తున్న పర్వతంపై నుంచి దూకాలని ఆమె కలలుకనేవారు. అందుకోసం బాగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం ప్రపంచ రికార్డును బ్రేక్ చేయాలని నిర్ణయించుకుని.. ఎవరెస్ట్ పర్వత అంచుకి హెలికాప్టర్ సాయంతో చేరుకున్నారు. ఎవరెస్ట్ ముందు 21,500 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేశారు. విజయవంతంగా కిందకి దిగడంతో శీతల్ మహాజన్ 21 వేల అడుగుల నుండి దూకి చరిత్ర సృష్టించిన తొలి మహిళగా రికార్డులో నిలిచింది.
ఆమె ఎవరెస్ట్ ప్రాంతంలో ఎన్నో స్కైడైవ్ లు చేశారు. 41 ఏళ్ల మహాజన్ గతంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ సాహసం నవంబర్ 13న చేయగా.. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భారత ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చూపినందుకు కొనియాడుతున్నారు. నవంబర్ 11న, మహాజన్ 17,500 అడుగుల ఎత్తులో 5,000 అడుగుల AGL నుంచి దూకారు. ఆమె గతంలో న్యూజిలాండ్‌కు చెందిన లెజెండరీ స్కైడైవర్ స్మిత్ విమానంలో శిక్షకురాలిగా సేవలందించారు.
Updated Date - 2023-11-15T17:10:55+05:30 IST