ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఈ దారుణాలు విమానాల్లో కూడా జరుగుతాయా? ప్యాసెంజర్‌కు షాకింగ్ అనుభవం

ABN, Publish Date - Dec 30 , 2023 | 05:55 PM

విమానంలో ఓ మహిళ తింటున్న శాండ్‌విచ్‌లో పురుగు బయటపడటం కలకలానికి దారితీసింది.

ఇంటర్నె్ట్ డెస్క్: ఆహారంలో పురుగులు లేదా బల్లులు, బొద్దింకలు వచ్చిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఇలాంటి ఘటనలు సాధారణంగా హోటళ్లకు వెళ్లినప్పుడో లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చినప్పుడో కస్టమర్లకు ఎదురవుతాయి. కానీ, విమానంలో ఈ దుస్థితి ఎదుర్కొన్న ఓ మహిళ దిమ్మెరపోయింది. చివరకు నెట్టింట తన ఆవేదన పంచుకుంది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఖుష్బూ గుప్తా అనే మహిళ డిసెంబర్ 29న ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయలుదేరింది. టిక్కెట్ బుక్ చేసుకున్న సమయంలోనే ఆమె ఫ్లైట్‌లో తినేందుకు ఓ శాండ్‌విచ్ కూడా బుక్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఫ్లైట్ సిబ్బంది శాండ్ విచ్ ఇచ్చారు. ఒక్క ముక్క తింటుండగా ఆమెకు చేతిలో ఉన్న శాండ్‌విచ్‌లో ఓ పురుగు లుకలుకలాడుతూ కనిపించడంతో ఆమె దిమ్మెరపోయింది (IndiGo passenger finds worm in sandwich ).

Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?


‘‘పురుగును చూసిన వెంటనే క్యాబిన్ క్రూకు సమాచారం అందించా. కానీ ఆమె ఇదేమీ పెద్ద విషయం కానట్టు స్పందించింది. సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఘటన గురించి తెలియజేస్తామని చెప్పి ఊరుకుంది. అంతేకాదు, మిగతా ప్రయాణికులకు యథాప్రకారం, శాండ్‌విచ్‌లను సరఫరా చేయడం ప్రారంభించింది. కానీ బాధ్యత గల వ్యక్తి ఆమె ఇతర ప్రయాణికులకు శాండ్‌విచ్‌లో పురుగు గురించి చెప్పి ఉండాల్సింది’’

‘‘శాండ్ విచ్ తినాలో వద్దో ఆ తరువాత వారి నిర్ణయానికి వదిలేసి ఉండాల్సింది. కానీ ఆమె మాత్రం ఈ ఉదంతం గురించి ఇతరులను అప్రమత్తం చేయకుండా తన పని తాను యథావిధిగా చేసుకుపోయింది. పిల్లలు, వృద్ధులు కూడా ఆమె శాండ్ విచ్‌ ఇచ్చింది. కొంత సేపటికి ఆమె మళ్లీ వచ్చి నా కోపం తగ్గించేందుకు ఏదో చిన్న బహుమతి ఇవ్వబోయినా నేను తిరస్కరించా. ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయాలనుకుంటున్నా’’ అని ఆమె పేర్కొంది.

Viral: ఈ కుర్రాడు స్విగ్గీ‌కే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!


కాగా, ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విమానాల్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోని ఎయిర్‌లైన్స్‌పై కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన నెట్టింట హాట్ టాపిక్ కావడంతో ఇండిగో కూడా స్పందించింది (Indigo Issues statement). కస్టమర్ ఆందోళన తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. పురుగు గురించి తెలియగానే తమ సిబ్బంది విమానంలో శాండ్‌విచ్ పంపిణీని ఆపేశారని తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పింది.

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!

Viral: రిస్క్ అని తెలిసీ ఆనంద్ మహీంద్రాను పబ్లిక్‌గా రూ. లక్ష అప్పు అడిగాడు.. ఆ తరువాత..

Updated Date - Dec 30 , 2023 | 06:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising