Inverter: ఇన్వర్టర్ బ్యాటరీని మీరే సొంతంగా రీఫిల్ చేస్తుంటారా? ఈ 4విషయాలు తెలుసుకోకపోతే కొంపలు మునిగినట్టే..
ABN, First Publish Date - 2023-07-31T15:10:23+05:30
ఇన్వర్టర్ బ్యాటరీ రీఫిల్ చేసేటప్పుడు చాలా మంది నిర్లక్ష్యం చేసే నాలుగు విషయాలు ఇవే..
కరెంట్ కొరత లేకుండా ఉండటం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఇప్పట్లో వంట నుండి స్నానం వరకు కరెంట్ తోనే గడుస్తాయి. వేసవికాలం కరెంటు కోత ఒకవైపు, వర్షాకాలం గాలి, వానల కారణంగా ఒకవైపు కరెంటు కోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా చాలామంది ఇన్వర్టర్ ఉపయోగిస్తుంటారు. చాలామంది ఇన్వర్టర్ బ్యాటరీని ఇంట్లోనే రీఫిల్ చేస్తుంటారు. ఇలా ఇంట్లోనే బ్యాటరీని రీఫిల్ చేసేటప్పుడు కొన్నివిషయాలు తెలుసుకోవాలి. లేకపోతే బ్యాటరీ కాలిపోవడం, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకీ చాలా మంది నిర్లక్ష్యం చేసే ఆ నాలుగు విషయాలు ఏంటో తెలుసుకుంటే..
ఇన్వర్టర్(inverter) ఉపయోగించేవారు బ్యాటరీలో నీటిని పోయడం గురించి మరీ ఎక్కువ శ్రద్ద తీసుకోరు. కానీ ఇంట్లోనే బ్యాటరీ రీఫిల్ చేస్తే మాత్రం ప్రతి 45రోజులకు ఒకసారి నీటి మట్టాన్ని చెక్ చేయాలి(water status checking once in 45 days). పొరపాటున బ్యాటరీలో నీరు అయిపోతే బ్యాటరీ ఎండిపోయి, పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఇది అగ్నిప్రమాదాలకు కూడా కారణం అవుతుంది. నీటి మట్టం సూచించే సిగ్నల్ ఎరుపు రంగులో ఉంటే నీరు నింపాలి, గ్రీన్ సిగ్నల్ ఉంటే నీరు పోయాల్సిన అవసరం లేదు.
Viral Video: ప్రతి ఒక్కరికీ ఓ అక్కో, చెల్లో ఉండాలని చెప్పేది ఇందుకే.. తమ్ముడి కోసం ఈ అక్క చేసిన సాహసం చూస్తే..
ఎంత స్వచ్చమైన మినరల్ వాటర్ అయినా ఇన్వర్టర్ బ్యాటరీలో పోయడానికి పనికిరావు. కేవలం డిస్టిల్డ్ వాటర్(distilied water) మాత్రమే వినియోగించాలి. పొరపాటున సాధారణ నీటిని పోస్తే బ్యాటరీ పాడైపోతుంది.
బ్యాటరీలో నీరు సరిపడినంత లేకపోతే బ్యాటరీకి ఎలాగైతే ముప్పు ఉంటుందో అదేవిధంగా నీటి మట్టం ఎక్కువ ఉన్నా బ్యాటరీ పనితీరుకు ప్రమాదమే. నీటిమట్టం సూచిక ఆకుపచ్చ రంగు దాటితే ఆ బ్యాటరీలో నీరు పోయకూడదు(don't put over water). ఒకవేళ పోస్తే ఇన్వర్టర్లో ఉపయోగించే యాసిడ్ మరింత పలచబడుతుంది. ఇది బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తుంది.
ఇన్వర్టర్ ఉపయోగించడంలో చాలామంది తెలుసుకోవలసిన విషయం బ్యాటరీ రీఫిల్ చేసిన వెంటనే ఇన్వర్టర్ ఉపయోగించకూడదు. ఎంత అవసరమైనా సరే రీఫిల్ చేసిన తరువాత 3-4 గంటల సేపు రిచార్జ్ చేసి ఆ తరువాత మాత్రమే ఇన్వర్టర్ ఉపయోగించాలి.
Viral Video: రైతే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ట్రాక్టర్ ను ఎలా మార్చేశాడో చూస్తే ..
Updated Date - 2023-07-31T15:10:23+05:30 IST