మార్కెట్లో రూ.10 కాయిన్స్ ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు..? ఇకపై అవి చెల్లవా..?
ABN, First Publish Date - 2023-01-20T16:26:29+05:30
పది రూపాయల నాణాలు చెల్లవంటూ చాలా కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి.. వ్యాపారులు, వినియోగదారులు 10 రూపాయల కాయిన్ (10 rupee coins) తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.. దీంతో పది రూపాయల నాణాలు మార్కెట్లో కనిపించడం లేదు.. నిజంగానే పది రూపాయల నాణాలు చెల్లవా?
పది రూపాయల నాణాలు చెల్లవంటూ చాలా కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి.. వ్యాపారులు, వినియోగదారులు 10 రూపాయల కాయిన్ (10 rupee coins) తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.. దీంతో పది రూపాయల నాణాలు మార్కెట్లో కనిపించడం లేదు.. నిజంగానే పది రూపాయల నాణాలు చెల్లవా? రూ.10 నాణేలు నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడంలేదా? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అసలు నిజమేంటి?
పది రూపాయల కాయిన్స్ చెల్లవనేది పూర్తిగా పుకారు మాత్రమే. పది రూపాయల కాయిన్లను అన్ని లావాదేవీలకు వినియోగించవచ్చని గతేడాదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పింది. ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించడానికి ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోంది. రూ.10 నాణేలను తీసుకోవడంలేదని పౌరుల నుంచి కంప్లైంట్స్ అందుతున్నాయి. వీటి గురించి ఆర్‌బీఐ (Reserve Bank Of India) చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా దీనిపై ఎస్‌ఎంఎస్ అవగాహన ఉద్యమం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ ఇప్పటికీ వివిధ సైజులు, డిజైన్లలో పది రూపాయల కాయిన్లను ముద్రిస్తోంది.
Updated Date - 2023-01-20T16:26:31+05:30 IST