ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lavanya Tripathi: 2023లో పెళ్లి చేసుకోబోతుందా.. వార్తలపై స్పందించిన నటి..

ABN, First Publish Date - 2023-03-03T15:13:50+05:30

‘అందాల రాక్షసి’ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పులి మేక’ (Puli Meka) వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ షో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘అందాల రాక్షసి’ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పులి మేక’ (Puli Meka) వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ షో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. పెళ్లి వార్తలపై స్పందించారు.

‘‘ప్రతి ఒక్కరు నా పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. నేను అదృష్టవంతురాలిని. నా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేయడం లేదు. నేను టాలీవుడ్‌లో పదేళ్లుగా సినిమాలు చేస్తున్నాను. అందువల్ల నేను వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలని అందరు అనుకుంటున్నారు. ఈ విషయం నాకు నవ్వు తెప్పిస్తుంది. ప్రస్తుతం పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. నా మాదిరిగా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ కెరీర్‌ను కొనసాగిస్తున్నవారు పని మీద మాత్రమే దృష్టిసారిస్తున్నారు. నా మనస్సంతా ఎప్పుడు పని మీదే ఉంటుంది. తర్వాత ప్రాజెక్టు ఏం చేయాలని నేను ఆలోచిస్తాను. ప్రస్తుతం నా జీవితం సినిమాలతోనే ముడిపడి ఉంది. నాకు పెళ్లికి సంబంధించిన కలలు ఏం లేవు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయటికి చెప్పడం నాకిష్టం ఉండదు. పెళ్లి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుసుకోవడం ముఖ్యం. మనకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు ఏడడుగులు వేస్తాం. అటువంటి సమయంలో మాత్రమే వివాహం అనేది అందమైనది. పెళ్లి మీద నాకు నమ్మకం ఉంది. అది జరగాల్సినప్పుడు మాత్రమే జరుగుతుంది’’ అని లావణ్య త్రిపాఠి తెలిపారు. ఇక లావణ్య కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన ‘పులి మేక’ వెబ్‌సిరీస్ ‘జీ-5’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించారు. కోన ఫిలిం కార్పొరేషన్, ‘జీ-5’ సంయుక్తంగా నిర్మించాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-03T16:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!