Phone Number: ఫోన్ నెంబర్‌కు 10 అంకెల సంఖ్యే ఎందుకు..? మొదటి రెండు అంకెలకు అసలు అర్థమేంటంటే..!
ABN, First Publish Date - 2023-06-13T16:20:12+05:30
ఈ పది నంబర్లకు మనం అలవాటు పడిపోయాం ఓ రకంగా.
మొబైల్ ఫోన్ ఒకప్పుడు ఇవి తెలీని రోజుల్లో ఓ వార్తను చేరవేయాలంటే ఉత్తరాలమీద ఆధారపడవలసి వచ్చేది. కానీ రోజులు మారుతున్నకొద్దీ వచ్చిన అనేక మార్పుల్లో వచ్చి పడ్డాయి. అయితే వీటిలో సాంకేతికత పెరిగాకా సెల్ ఫోన్ వాడకం కూడా చాలా పెరిగింది. ఇక్కడే ఉండి అనేక దేశాల్లోని ప్రజలతో మాట్లాడుకునే వీలుంటుంది.
మరీ ముఖ్యంగా వాళ్లను ఈ చిన్న సెల్ ఫోన్ లలో వీడియో కాల్ ద్వారా చూసే వీలు కూడా కలుగుతుంది. మరి ఈ సెల్ ఫోన్ కు ఉండే నెంబర్స్ పది అంకెల గురించి మీకు ఎంత వరకూ తెలుసు? మొదటి రెండు అంకెలకు అసలు అర్థం ఏంటి? ఇదే తెలుసుకుందాం.
మనం మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పటి నుండి, 10 అంకెల మొబైల్ నంబర్ నే వాడుతున్నాం. ఇది చాలా సంవత్సరాలైంది, కానీ ఇప్పటికీ అదే సంఖ్యలో అంకెలు ఉన్నాయి ఎందుకో తెలుసా..మొదట్లో, ఈ సంఖ్యలు ‘9’తో మొదలయ్యాయి. గత 7 నుంచి 8 సంవత్సరాలుగా అదే నంబర్‌ను ఉపయోగిస్తుంటే, ఇప్పటికీ 9తో ప్రారంభమయ్యే మొబైల్ నంబర్‌ని వాడుతూ ఉండాలి.
ఇది కూడా చదవండి: స్మార్ట్‌ఫోన్‌కు కింది భాగంలో ఆ రంధ్రం దేనికోసం..? ఛార్జింగ్ కోసం కాదు.. ఇయర్ ఫోన్స్ కోసం కూడా కాదు కానీ..!
కాలం గడుస్తున్న కొద్దీ మనకు 8, 7తో మొదలై 6 సంఖ్యలు వచ్చాయి. అసలు ఈ పది అంకెల మొబైల్ నంబర్ ఎందుకు? మొబైల్ నంబర్లోని అంకెల సంఖ్య ప్రధానంగా దేశ జనాభాపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా చట్టాలను రూపొందిస్తారు. ఇప్పటి లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 1,315,517,078. దీని మూలంగానే మన మొబైల్ నంబర్ పది అంకెలకు కుదించి పెట్టి ఉండవచ్చు. సరైన సమాచారం తెలియకపోయినా ఈ పది నంబర్లకు మనం అలవాటు పడిపోయాం ఓ రకంగా.
Updated Date - 2023-06-13T16:20:12+05:30 IST