ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avatar: The Way of Water: 2 బిలియన్ క్లబ్‌లోకి చేరిన ‘అవతార్ 2’

ABN, First Publish Date - 2023-01-23T18:10:37+05:30

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar 2). ఈ సినిమా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar 2). ఈ సినిమా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009లో విడుదలైన ‘అవతార్’ (Avatar) కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదలైంది. 160 భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుబాటులో ఉన్న అన్ని ఫార్మాట్స్‌లో చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే రికార్డులను రాయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా ఈ మూవీ 2బిలియన్ క్లబ్‌లోకి చేరింది.

‘అవతార్ 2’ సైన్స్ ఫిక్షన్‌గా పండోరా నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.024బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది. అమెరికా, కెనడాలో ఈ చిత్రం 600బిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి 1.4బిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌తో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ 2బిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి చేరింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన ఆరో సినిమాగా నిలిచింది. ఇండియాలో కూడా ‘అవతార్ 2’ భారీగా కలెక్షన్స్‌ను రాబట్టింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించింది. భారత్‌లో ఈ చిత్రం రూ.387.82కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతానికి 2 బిలియన్ డాలర్స్ క్లబ్‌లో ఆరు చిత్రాలు ఉంటే.. అందులో మూడు జేమ్స్ కామెరూన్‌వే ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. కామెరూన్ దర్శకత్వం వహించిన ‘టైటానిక్’, ‘అవతార్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమాలు 2 బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టాయి. ఆల్‌టైం హయ్యెస్ట్ గ్రాసర్‌గా ఈ లిస్ట్‌లో ‘అవతార్’ మొదటి స్థానంలో ఉంది.

Updated Date - 2023-01-23T18:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising