ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: భారతీయుడికి దిమ్మతిరిగే ఝలకిచ్చిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. నువ్వు సిగ్గుతో తలదించుకోవాలంటూ ఫైర్..

ABN, First Publish Date - 2023-11-26T16:43:36+05:30

తనను ట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ఓ నెటిజన్‌కు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీరోడ్స్ దిమ్మతిరిగే షాకిచ్చాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ట్రోలింగ్‌ను సెలబ్రిటీలు లైట్ తీసుకునే వాళ్లు. ఈ మధ్య నెటిజన్ల దూకుడు నానాటికీ పెరుగుతుండటంతో సెలబ్రిటీలకూ సహనం నశిస్తోంది. అపవాదులు వేస్తూ వేధిద్దామనుకునే వారికి అంతే దీటుగా జవాబిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మేటి ఫీల్డర్ జాంటీ రోడ్స్(Jonty Rhodes) ఇలాగే చేశాడు. ముందూవెనుకా ఆలోచించకుండా తనపై నోరు పారేసుకున్న నెటిజన్‌కు అంతే దీటుగా సమాధానమిచ్చాడు. నెట్టింట ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా(Viral) మారింది.

Bride: 7 అడుగులు వేశాక వరుడి ప్రవర్తనపై డౌట్.. నాకీ పెళ్లి వద్దంటూ బాంబు పేల్చిన వధువు.. అసలేం జరిగిందంటే..!

ఇంతకీ జరిగిందేంటంటే.. జాంటీ రోడ్స్ ఇటీవల భారత పర్యటనకు వచ్చాడు. తన డ్రైవర్ సలహా మేరకు బెంగళూరులోని(Bengaluru) ఓ హోటల్‌లో అల్పాహారం తీసుకున్నాడు. తను టిఫిన్ తింటుండగా తీసిన ఫొటోను నెట్టింట్లో షేర్ చేశాడు. డ్రైవర్ సూచించిన మంగళూరు బన్, మైసూర్ మసాలా దోస అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దేశీ వంటకాలను ఆస్వాదిస్తున్నందుకు అనేక మంది జాంటీని ప్రశంసించారు.

Phone Charging: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో పెడితే అసలేం కాదా..? కొన్ని ఫోన్లు మాత్రమే ఎందుకు పేలిపోతుంటాయంటే..!


అయితే, ఫొటోలో జాంటీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఏమీ తిన్నట్టు ఫొటోలో కనిపించలేదు. అతడి ముందు ప్లేట్ ఏదీ కనిపించలేదు. దీంతో కొందరి ఊహలకు రెక్కలొచ్చాయి. జాంటీ ఎదురుగా ఉన్నది అతడి డ్రైవర్ అనుకున్నారు. మరో ఆలోచన లేకుండా జాంటీ తప్పుచేశాడంటూ నెట్టింట గగ్గోలు పుట్టించారు. డ్రైవర్‌కు కూడా టిఫిన్ పెట్టిస్తే పోయేదేముందంటూ ట్రోలింగ్ మొదలెట్టారు. ఈ వ్యవహారం అదుపు తప్పడం చూసిన జాంటీ చివరకు రంగంలోకి దిగాడు. అసలు జరిగిందేంటో పూర్తిగా వివరించాక తనపై నోరుపారేసుకున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాడు(Jonty Rhodes shuts down trolls).

Viral Video: మా అమ్మకు నేనంటే ఇష్టం లేదనుకుంటా.. ఈ 4 ఏళ్ల పిల్లాడి వీడియో చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

ఫొటోలో తనకెదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తనకు తెలియదని జాంటీ చెప్పుకొచ్చాడు. అయితే, ఆ ఫొటో తీసింది మాత్రం తన డ్రైవర్ అని చెప్పాడు. ఏమైనా తినమని తాను డ్రైవర్‌కు చెప్పినా అతడు సున్నితంగా తిరస్కరించాడని జాంటీ పేర్కొన్నాడు. డ్రైవర్ టీ మాత్రమే తాగాడని, ఆ డబ్బులు తానే చెల్లించానని చెప్పుకొచ్చాడు. ఇదంతా తెలుసుకోకుండా తనపై నోరుపారేసుకున్న నెటిజన్‌కు జాంటీ గట్టిగా బుద్ధి చెప్పాడు. అనవసరంగా నోరు జారినందుకు తలదించుకోవాలంటూ నెటిజన్‌పై మండిపడ్డాడు. కాగా, అనేక మంది భారతీయులు జాంటీకి మద్దతుగా నిలిచారు. ఇలాంటి ట్రోలింగ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో, ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లోకొచ్చింది.

Woman: ఆమె పిల్లల్ని కనలేదు.. గర్భం దాల్చలేదు.. కోర్టుకు తేల్చిచెప్పిన మెడికల్ టీమ్.. భర్త బెయిల్ కేసులో..!

Updated Date - 2023-11-26T16:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising