Kajal Aggarwal: ఆరేళ్ల తర్వాత స్టార్ హీరోతో సినిమా!

ABN, First Publish Date - 2023-02-28T17:06:16+05:30

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈ ‘చందమామ’ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. కొత్త చిత్రాలకు ఓకే చెబుతుంది.

Kajal Aggarwal: ఆరేళ్ల తర్వాత స్టార్ హీరోతో సినిమా!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈ ‘చందమామ’ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. కొత్త చిత్రాలకు ఓకే చెబుతుంది. కాజల్ తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో మూవీలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం అందుతుంది.

Ajith.jpg

మగిజ్ తిరుమనేని (Magizh Thirumeni) దర్శకత్వంలో అజిత్ (Ajith) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే 62’ (AK62) అని వ్యవహరిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం నుంచి త్వరలోనే రానుందట. ‘ఏకే 62’ కు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తారని గతంలో చిత్ర బృందం ప్రకటనను వెలువరించింది. సృజనాత్మక విభేదాల వల్ల కెప్టెన్ కుర్చీ నుంచి విఘ్నేశ్ తప్పుకొన్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, నయనతార, త్రిష తదితరుల పేర్లు హీరోయిన్‌గా ప్రచారంలోకి వచ్చాయి. డేట్స్, మరికొన్ని కారణాల వల్ల మూవీ చేయడానికి వారు అంగీకరించలేదు. కాజల్ అగర్వాల్‌ను సంప్రదించగా ఆమె సినిమా చేసేందుకు అంగీకరిచినట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో అజిత్, కాజల్ కలసి ‘వివేకం’ (Vivegam) లో నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఒకవేళ ఆమె కనుక హీరోయిన్‌గా నటిస్తే అజిత్, కాజల్‌ల జోడీ ఆరేళ్ల తర్వాత రిపీట్ అవుతుంది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ (Indian 2) లో నటిస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలోను ఆమె హీరోయిన్‌గా చేయనున్నారని సమాచారం అందుతుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-28T17:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!