ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hariprriya: కనుల పండువగా హీరో, హీరోయిన్ పెళ్లి

ABN, First Publish Date - 2023-01-26T20:33:36+05:30

కన్నడలో పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకున్న నటి హరి ప్రియ (Hariprriya). ‘పిల్ల జమీందార్’, ‘జై సింహా’ వంటి తెలుగు చిత్రాల్లోను నటించింది. ఈ అందాల భామ కన్నడ నటుడు వశిష్ట సింహా (Vasishta Simha) ను తాజాగా పెళ్లి చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడలో పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకున్న నటి హరి ప్రియ (Hariprriya). ‘పిల్ల జమీందార్’, ‘జై సింహా’ వంటి తెలుగు చిత్రాల్లోను నటించింది. ఈ అందాల భామ కన్నడ నటుడు వశిష్ట సింహా (Vasishta Simha) ను తాజాగా పెళ్లి చేసుకుంది. ఈ జంట వివాహం మైసూరులో జనవరి 25న కనుల పండువగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులందరు షేర్ చేయడం మొదలుపెట్టారు.

కన్నడ నటుడు ధనుంజయ ఈ పెళ్లికి హాజరయ్యాడు. నూతన వధూవరులతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ పిక్స్‌లో హరిప్రియ, వశిష్ట సింహా సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను ఈ జంట ఇంత వరకు షేర్ చేయలేదు. గతేడాది డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్‌ను హరిప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నా పేరు చివరన త్వరలోనే సింహా ట్యాగ్ రాబోతుంది. ఈ ట్యాగ్‌తో నేను ప్రేమలో పడిపోయాను. మా రింగ్స్‌లో ఆ పేరు ప్రతిబింబించాలనుకున్నాను. సింహాలతో ఉంగరాలను కస్టమ్ డిజైన్ చేయించాను’’ అని హరిప్రియ చెప్పింది.

Updated Date - 2023-01-26T20:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising