ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karan Johar: సమయం కోసం వేచి ఉన్నాడు.. ‘పఠాన్’ని ప్రశంసించిన కరణ్

ABN, First Publish Date - 2023-01-26T14:37:59+05:30

ఇటీవలికాలంలో సౌత్ సినిమాలు (South movies) పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతుండగా.. బాలీవుడ్ (Bollywood) సినిమాలు మాత్రం నిరాశ పరచడం తెలిసిందే.

Karan Johar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలికాలంలో సౌత్ సినిమాలు (South movies) పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతుండగా.. బాలీవుడ్ (Bollywood) సినిమాలు మాత్రం నిరాశ పరచడం తెలిసిందే. ఈ తరుణంలో విడుదలైన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చిత్రం ‘పఠాన్’ (Pathaan) బాలీవుడ్‌కి ప్రాణం పోసింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలను అందుకుంది. దీంతో ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ పోస్ట్‌ని షేర్ చేశాడు.

కరణ్ చేసిన ఆ పోస్ట్‌లో.. ‘నేను చివరిసారిగా ఎప్పుడూ సినిమాలను ఎంజాయ్ చేశానో గుర్తు లేదు!!!! ఇది అతి పెద్ద బ్లాక్‌బస్టర్ !!! మెగా అనొచ్చు!!! షారుఖ్.. లుక్స్, నటన సూపర్‌ స్టార్‌డమ్.. హాటెస్ట్, అందమైన ఏజెంట్ దీపికా పదుకొనే, విలన్‌గా జాన్ అబ్రహాం సూపర్ ఉన్నారు!!! సిద్ధార్థ్ ఆనంద్ అద్భుతంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు! చాలా కొద్ది మందికే సినిమాని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అందులో సిద్ధార్థ్ ఒకరు. నా బెస్ట్ ఫ్రెండ్, బయట ఎవరికీ ఆదిత్య చోప్రా గురించి నేను చాలా గర్వపడుతున్నాను!!! మీకు భవిష్యత్తులో కూడా బయట కనిపించకపోవచ్చు! కానీ అతని విజన్, తెలివితేటలు మాత్రం ఆమోగం! ఇక షారుఖ్ విషయానికి వస్తే.. ఆయన ఎక్కడికి వెళ్లలేదు. సరైన సమయంలో కోసం ఎదురుచూసి బాక్సాఫీస్‌ని ఏలడానికి వచ్చేశాడు! లవ్ యూ షారుఖ్!!! లవ్ యూ ఆది! లవ్ యూ బాలీవుడ్! నిన్ను బాయ్‌కాట్ చేయాలని అనుకున్నప్పటికీ ఎవరూ నిన్ను ఆపలేరు. అందరికీ పఠాన్ శుభాకాంక్షలు!!! చిత్రంలో షారుఖ్, సల్మాన్ కలిసి కనిపించినప్పుడూ చాలా ఎంజాయ్ చేశాను. నిలబడి చప్పట్లు కొట్టాను’ అని రాసుకొచ్చాడు.

Updated Date - 2023-01-26T14:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising