అది తినదగిన బంగారం... దానిని ఎలా తయారు చేస్తారు? ఇంతకీ స్వర్ణంతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-04-22T12:13:39+05:30
భారతీయులకు(Indians) బంగారమంటే ఎంత మోజుంటుందో అందరికీ తెలిసిందే. అప్పుచేసైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.
భారతీయులకు(Indians) బంగారమంటే ఎంత మోజుంటుందో అందరికీ తెలిసిందే. అప్పుచేసైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. భవిష్యత్‌లో ఉపయోగపడుతుందనో లేదో పక్కింటివాళ్లు కొనుకున్నారనో ఇలా రకరకాల నెపాలతో బంగారాన్ని(Gold) కొనుగోలు చేస్తుంటారు.
అయితే వీటికి భిన్నంగా తినదగిన బంగారం కూడా ఉందని, అది ఆరోగ్యాన్ని అందిస్తుందనే విషయం మీకు తెలుసా? తినదగిన బంగారాన్నితయారు చేయడానికి, స్వచ్ఛమైన బంగారాన్ని(Pure gold) 2,000 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద కరిగించి, దానిని ఒక బార్‌లో పోస్తారు. దానిని .0001 మిల్లీమీటర్ల మందం వచ్చే వరకు పౌండ్ చేస్తారు. అప్పుడు అది తినేందుకు వీలైన బంగారం మాదిరిగా అంటే పలుచని రేకు మాదిరిగా తయారవుతుంది.
ఈ రేకులను 5,000 ఏళ్ళ క్రితమే ఈజిప్షియన్లు(Egyptians) తయారు చేశారని చరిత్ర చెబుతోంది. ఈ తినదగిన బంగారం పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు(Experts) చెబుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ డైనింగ్ కోసం ఇటువంటి బంగారాన్ని ఉపయోగిస్తారు. తినదగిన బంగారం(Edible gold) డైటరీ ఫైబర్‌కు మంచి మూలం అని చెబుతుంటారు. ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో, జీర్ణవ్యవస్థను(Digestive system) కాపాడటంలో ఎంతగానో సహాయపడుతుంది.
తినదగిన బంగారం వృద్ధాప్య ఛాయలను(Aging shades) తగ్గిస్తుంది. చర్మంపై ముడుతలను తగ్గించడానికి, వయస్సు ప్రభావాన్ని తగ్గించడానికి తినదగిన బంగారం దోహదరపడుతుందని పలు అధ్యయనాల్లో(studies) వెల్లడయ్యింది. తినదగిన బంగారంలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పర్యావరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. తినదగిన బంగారాన్ని భోజనానికి జోడించినప్పుడు విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
బంగారు రేకులతో డెజర్ట్‌లను అలంకరించడం ద్వారా ఆయా ఆహారాలకు ప్రత్యేకతను తీసుకువస్తుంది. ఇదిలావుంటే బంగారాన్ని ధరించడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) సమకూరుతాయి. బంగారం అనేది కేవల అలంకార ప్రాయం మాత్రమే కాదు. బంగారం వేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం సమకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. చర్మానికి వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు(Infections) దరిచేరకుండా బంగారం కాపాడుతుంది. బంగారాన్ని మనం ధరించడం వలన వేసవిలో శరీరానికి చల్లదనం, చలి కాలంలో వెచ్చదనం అందుతుంది. స్వర్ణ ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ(blood circulation) మరింత మెరుగుపడుతుంది.
శరీరంపై ఏదైనా గాయం తగిలితే, ఆ గాయం త్వరగా నయం అయ్యేందుకు బంగారం దోహద పడుతుంది. బంగారంలో చర్మానికి మేలు చేకూర్చే అనేక ఖనిజాలు(Minerals) ఉన్నాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి బంగారు ఆభరణాలు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి.
అంతేకాకుండా బంగారం మన నిద్ర సమయంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. అంతేకాదు ఒక్కో బంగారు ఆభరణం ఆరోగ్యానికి ఒక్కో విధంగా మేలు చేస్తుంని నిపుణులు చెబుతున్నారు. ముక్కుపుడక ధరించడం వల్ల మాట్లాడే సమయంలో పైపెదవికి ఇది తగిలి వీలైనంత వరకూ తక్కువగా మాట్లాడమని సూచిస్తుందట.
ముక్కెర ధరించడం వల్ల అది ధరించిన వారికి ముక్కు కొనపై దృష్టి ఏర్పడుతుంది. అలా దృష్టి ఉండడం ధ్యానం(meditation)లో ఒక భాగం. ఈ విధంగా చెడు శ్వాస కలిగిన గాలిని బంగారం పవిత్రం చేస్తుందని చెబుతారు. చేతికి బంగారు గాజులు(Gold bangles) వేసుకోవడం వల్ల మణికట్టు మీద ఉన్న నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. బంగారు నగలను ధరించడం వలన గుండె సంబంధిత వ్యాధులకు(diseases) దూరంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-04-22T12:14:13+05:30 IST