Kollywood Director: ‘నేను ఆ కులానికి వ్యతిరేకం కాదు.. ఆ దర్శకుడు కూడా’
ABN, First Publish Date - 2023-02-15T12:19:53+05:30
‘ద్రౌపది’, ‘రుద్రతాండవం’ వంటి చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు పొందిన తమిళ దర్శకుడు జి.మోహన్ (G mohan) తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘బకాసురన్’ (Bakasuran).
‘ద్రౌపది’, ‘రుద్రతాండవం’ వంటి చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు పొందిన తమిళ దర్శకుడు జి.మోహన్ (G mohan) తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘బకాసురన్’ (Bakasuran). ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా, నట్టి పోలీస్ అధికారిగా నటించారు. రాధారవి, నిర్మాత కె.రాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ను చిత్రబృందం జోరుగా చేస్తోంది. ఈ తరుణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకుడు మోహన్ మాట్లాడాడు.
మోహన్ మాట్లాడుతూ.. ‘‘సెల్వరాఘవన్ తెరకెక్కించిన ‘కాదల్ కొండేన్’ వంటి సినిమాలే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం. ‘బకాసురన్’ ఎవరు? ఆయన ఎలాంటి వ్యక్తి? వంటి విషయాలను ఇందులో వెల్లడించాను. ఒక కులానికి లేదా ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా నేను చిత్రాలు నిర్మించడం లేదు. ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించాం. నాకు తెలిసిన, నేను చేసిన పరిశోధనల్లో వెల్లడైన అంశాలతోనే ఈ కథ సిద్ధం చేశాను. పా.రంజిత్ (Pa. Ranjith) షెడ్యూల్ తెగలు, నేను ఓబీసీ వర్గం కోసం సినిమాలు తీస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఇక్కడ నాకు ఎవరూ శత్రువులు లేరు. ఇలాంటి సినిమాలు మున్ముందు కూడా తీస్తాను.
ఇది కూడా చదవండి: Anikha Surendran: డైలాగుల విషయంలో చాలా కష్టపడ్డా
సినిమాలు, సమాజం, రాజకీయాల్లో సమానత్వం కావాలి. నేను కులాన్ని ఎత్తి చూపడం లేదు. ‘ద్రౌపది’ చిత్ర కథ నిజంగానే అనేక ప్రాంతాల్లో జరిగింది. ఈ ‘బకాసురన్’ స్టోరీ మొబైల్‌లో ఉండే కొన్ని యాప్‌ల ద్వారా మధ్యతరగతి వర్గానికి చెందిన మహిళలు ఏ విధంగా నష్టపోతున్నారు. ఆత్మహత్యలకు ప్రేరేపించే నేరాలు, వాటి వెనుక ఉన్న కారణాలపై లోతుగా అధ్యయనం చేసి ఇందులో చెప్పాం. లైంగిక నేరాలకు పాల్పడే మహిళలకు ఎలాంటి శిక్షలు లేవు. వారిని ప్రభుత్వ హోంలకు పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లి అనేక విషయాలు సేకరించాను. ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని చెప్పుకొచ్చాడు.
Updated Date - 2023-02-15T12:29:47+05:30 IST