షాకింగ్ ఘటన.. 40 నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు.. ప్రాణభయంతో ప్రయాణీకులందరికీ టెన్షన్ టెన్షన్.. చివరకు..
ABN, First Publish Date - 2023-01-21T15:21:55+05:30
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా భోపాల్‌లో ఇండిగో విమానం (Indigo Flight) ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదుర్కొంది.
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా భోపాల్‌లో ఇండిగో విమానం (Indigo Flight) ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదుర్కొంది. దీంతో 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ 40 నిమిషాలు ఏం జరుగుతోందో తెలియక విమానంలోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు రెండో ప్రయత్నంలో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఇండిగోకు చెందిన ప్రయాగ్‌రాజ్-భోపాల్ విమానం (6E-7925) శుక్రవారం మధ్యాహ్నం 1:10 గంటలకు రాజా భోజ్ విమానాశ్రయంలో (Bhopal Airport) దిగాల్సి ఉంది. అయితే బలమైన గాలి కారణంగా విమానంపై అధిక ఒత్తిడి ఏర్పడడంతో ల్యాండింగ్ సమయంలో సమస్య ఎదురైంది (Landing failed). ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించగా విమానంలో కంపనాలు మొదలయ్యాయి. దీంతో పైలట్లు విమానాన్ని తిరిగి గాలిలోకి తీసుకెళ్లారు. విమానంలో నిరంతర కంపనాలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
పైలెట్లు విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ విమానంలో సిబ్బందితో సహా 74 మంది ఉన్నారు. రాజధానిలో జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు చాలా మంది ప్రయాణికులు వస్తున్నారు.
Updated Date - 2023-01-21T15:21:57+05:30 IST