longest Tongue: పొడవైన నాలుకతో రెండు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు
ABN, First Publish Date - 2023-03-17T20:55:31+05:30
ప్రపంచంలో అతిపెద్ద నాలుకతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన నిక్ స్టాబెర్ల్ తాజాగా మరో రికార్డు సృష్టించాడు. తన పొడవైన నాలుకతో అతి తక్కువ టైంలో జెంగా బ్లాక్స్‌ను తొలగించి మరోసారి గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
Longest Tongue: ప్రపంచంలో అతిపెద్ద నాలుకతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి(Guinness World Record) ఎక్కిన నిక్ స్టోబెర్ల్ తాజాగా మరో రికార్డు సృష్టించాడు. తన పొడవైన నాలుకతో అతి తక్కువ టైంలో జెంగా బ్లాక్స్‌ను తొలగించి మరోసారి గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. 10.1cm (3.91Inch) నాలుకతో ప్రపంచంలోనే అత్యంత పొడవాటి నాలుక(Longest tongue)గా గిన్నిస్ రికార్డు సృష్టించిన నిక్ స్టోబెర్ల్ నాలుకతో ఐదు జెంగా బ్లాక్‌లను(Jenga blocks) అత్యంత వేగంగా తొలగించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అమెరికాలోని సాలినాస్(Salinas) కు చెందిన నిక్ స్టోబెర్ల్ 55.526 సెకన్లలో స్టాక్ నుండి ఐదు జెంగా బ్లాక్‌లను తొలగించగలిగాడు.
గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ నిక్ స్టాబెర్ల్ మాట్లాడుతూ రెండోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో తన పేరు నమోదు కావడం తన జీవితాన్నే మార్చేసిందన్నారు. నేను వివిధ దేశాలకు వెళ్లి అన్ని రకాల సంస్కృతులను చూడగలిగాను, మంచి వ్యక్తులతో కలిసి మంచి ఆహారాన్ని పొందగలిగాను" అని తెలిపారు. సగటున నాలుక పొడవు కేవలం మూడు అంగుళాలు.. స్త్రీలకు 7.9 cm (3.11 inch), పురుషులకు 8.5 సెం.మీ (3.34 అంగుళాలు) ఉంటుందని.. తన నాలుక మాత్రం 10.1 సెం.మీ. (3.97 inch) ఉంటుందని అని నిక్ చెప్పాడు.
నేను మొదటి రికార్డును బద్దలు కొట్టినప్పుడు, నా నాలుకను ఏదైనా పనికి ఉపయోగించాలనుకున్నాను.. భారతదేశంలోని ఒక వ్యక్తి తన నాలుకతో పెయింటింగ్ వేస్తున్న వీడియోను చూసి స్ఫూర్తిని పొందానని నిక్ స్టాబెర్ల్ తెలిపారు. నిక్ తన తాజా రికార్డును సృష్టించే ముందు తన నాలుకను ఉపయోగించి ఆసక్తికరమైన కళను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. రికార్డ్ బుక్ ప్రకారం, ఈ ఫీట్ కంటే ముందు, నిక్ ఒక నిమిషంలో అత్యధిక నాలుక నుండి ముక్కు తాకిన రికార్డును బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. 281 సార్లు నాలుకతో ముక్కును తాకే రికార్డును బద్దలు కొట్టాల్సి ఉండగా 246 మాత్రమే తాకి విఫలమయ్యాడు. అయినా నిరాశ చెందకుండా ఐదు జెంగా బ్లాక్‌లను అత్యంత వేగంగా తొలగించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
Updated Date - 2023-03-17T21:12:45+05:30 IST