ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: లాటరీ టిక్కెట్ ఏజెంట్‌కు ఊహించని సర్‌ప్రైజ్.. అన్నీ అమ్ముడుపోగా చివర్లో మిగిలిన ఒకే ఒక టిక్కెట్‌తో...

ABN, First Publish Date - 2023-10-08T19:13:19+05:30

ఇటీవల కేరళలోని ఓ లాటరీ ఏజెంట్‌ను అదృష్టం అనూహ్యంగా వరించింది. ఒక్కరాత్రిలో అతడిని కుబేరుడిని చేసేసింది. అన్ని టిక్కెట్లు అమ్మగా మిగిలిపోయిన టిక్కెట్టుతో ఆయన ఏకంగా రూ.కోటి గెలుచుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో అదృష్టం ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో చెప్పడం కష్టం. మనుషలుగా మనం చేయాల్సిందల్లా కాలం కలిసొచ్చే వరకూ ఓపిగ్గా ఎదురుచూడటమే! ఇటీవల కేరళలోని ఓ లాటరీ ఏజెంట్‌ను అదృష్టం అనూహ్యంగా వరించింది. ఒక్కరాత్రిలో అతడిని కోటీశ్వరుడిని చేసింది. లాటరీలో కోటి దక్కడంతో అతడు ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు(Lottery agent in Kerala wins Rs 1 crore after unsold ticket gets first prize). పూర్తి వివరాల్లోకి వెళితే..

కోజీకోడ్ జిల్లాకు చెందిన ఎన్‌కే గంగాధర్ 33 ఏళ్ల పాటు బస్ కండక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సుమారు నాలుగేళ్ల క్రితం ఆయన లాటరీ టిక్కెట్ల షాపు పెట్టుకున్నారు.

Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ


ఇటీవల ఓ రోజు గంగాధర్ యథాప్రకారం లాటరీ టిక్కెట్లు అమ్మగా చివర్లో ఆయన వద్ద ఓ టిక్కెట్ మిగిలిపోయింది. అయితే, అనూహ్యంగా ఆ టిక్కెటుకు కోటి లాటరీ తగలడంతో ఆయన ఆనందానికి అంతేలేకుండా పోయింది. అయితే, ఈ విషయం బయటపడితే టిక్కెట్ ఎవరైనా దొంగిలించే అవకాశం ఉందని భావించిన గంగాధర్ చివరకూ తనకు లాటరీ తగిలిన విషయాన్ని గోప్యంగానే ఉంచారు. మరో విశేషమేంటంటే, ఆ రోజు ఆయన వద్ద టిక్కెట్ కొనుగోలు చేసిన మరో ఆరుగురినీ అదృష్టం వరించింది. ఒక్కొక్కరూ రూ. 5 వేలు చొప్పున గెలుచుకున్నారు.

Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..

దుబాయ్‌లో పనిచేసే ఓ బెంగళూరు వ్యక్తికి ఇటీవల ఇలాగే అదృష్టం వరించిన విషయం తెలిసిందే. అబుదాబీ బిగ్ టిక్కెట్ డ్రాలో అరుణ్ కుమార్ ఏకంగా రూ.44 కోట్లు గెలుచుకున్నారు. అయితే, లాటరీ నిర్వహకులు ఆయనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా అది ప్రాంక్ కాల్ అని భావించిన అరుణ్ వారి నెంబర్ బ్లాక్ చేశారు. ఆ తరువాత మరో నంబర్ నుంచి వారు ఫోర్ చేసి విషయం చెప్పాకగానీ ఆయనకు నమ్మకం కుదరలేదు.

Updated Date - 2023-10-08T19:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising