Malavika Mohanan: అలా పిలవాల్సిన అవసరం లేదు.. నయనతారను మళ్లీ టార్గెట్‌ చేసిన హీరోయిన్

ABN, First Publish Date - 2023-02-13T09:50:37+05:30

గత కొంతకాలంగా కోలీవుడ్ భామలు నయనతార (Nayanathara), మాళవిక మోహనన్ (Malavika Mohanan) మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మాళవిక ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది

Malavika Mohanan: అలా పిలవాల్సిన అవసరం లేదు.. నయనతారను మళ్లీ టార్గెట్‌ చేసిన హీరోయిన్
Nayanathara
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొంతకాలంగా కోలీవుడ్ భామలు నయనతార (Nayanathara), మాళవిక మోహనన్ (Malavika Mohanan) మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మాళవిక ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘ఓ సినిమాలో ఓ లేడీ సూపర్‌స్టార్ హాస్పిటల్ సీన్‌‌లో నటించింది. అందులో ఆమె బెడ్‌పై ఉన్నప్పటికీ పెదాలకు లిప్‌స్టిక్, ముఖానికి మేకప్‌తో కనిపించింది. అలా ఎలా ఉంటారో నాకు అర్థం కాలేదు’ అని మాళవిక పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మాళవిక మాట్లాడింది ‘రాజా రాణి’ సినిమాలో నయనతార గురించేనని ఫ్యాన్స్ చర్చించుకున్నారు.

Malavika1.jpg

ఇది కూడా చదవండి: Rajinikanth: నా పేరు వాడుకుంటే చర్యలు.. కంపెనీలకి సూపర్‌స్టార్ హెచ్చరికలు

అనంతరం ఓ సందర్భంలో నయనతార మాట్లాడుతూ.. ‘ఆ సీన్‌లో నేను దానికి తగ్గట్లు మేకప్ వేసుకుంటానని చెప్పాను. కానీ ఇతర సినిమాలు వేరు.. కమర్షియల్ సినిమాలు వేరు. అందుకే అంత కష్టపడాల్సిన పని లేదని మా దర్శకుడు చెప్పాడు’ అని రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య చెలరేగిన గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు.

కానీ, ఇప్పుడు మళ్లీ రాజుకుంది. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో మాళవిక ముచ్చటించారు. ఇందులో ఓ అభిమాని ‘లేడీ సూపర్‌స్టార్‌’ (Lady Superstar)పై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా ‘నిజంగా ఆ వార్తపై నాకు నమ్మకం లేదు. మహిళలు కూడా సూపర్‌స్టార్‌ అని పిలవొచ్చు. లేడీ సూపర్‌స్టార్‌ పిలవడంలో ఆవశ్యకత ఏంటో నాకు బోధపడటం లేదు. సూపర్‌స్టార్‌ అని పిలిస్తేనే సరిపోతుంది కదా. దీపికా పదుకొనె, అలియా భట్‌, కత్రినా కైఫ్‌ వంటి వారు సూపర్‌స్టార్లు. అలాగే, అందర్నీ పిలవవచ్చు’ అని అన్నారు. దీనికి నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Updated Date - 2023-02-13T09:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising