ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 ఏళ్లుగా చేస్తున్న జాబ్‌కు గుడ్ బై.. రోడ్డు పక్కన టీ అమ్ముతూ జీవనం.. హాయిగా ఉద్యోగం చేసుకోక ఎందుకీ నిర్ణయం అని అడిగితే..

ABN, First Publish Date - 2023-03-17T19:44:41+05:30

ఆ వ్యక్తి వయసు 45 ఏళ్లు.. 16 ఏళ్లుగా ఓ మిల్లులో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.. అయితే అక్కడ ఇచ్చే జీతం కుటుంబాన్ని పోషించేందుకు సరిపోయేది కాదు.. దాంతో 45 ఏళ్ల వయసులో అతను రిస్క్ చేశాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆ వ్యక్తి వయసు 45 ఏళ్లు.. 16 ఏళ్లుగా ఓ మిల్లులో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.. అయితే అక్కడ ఇచ్చే జీతం (Salary) కుటుంబాన్ని పోషించేందుకు సరిపోయేది కాదు.. దాంతో 45 ఏళ్ల వయసులో అతను రిస్క్ చేశాడు.. ఉద్యోగం మానేసి ఓ టీ స్టాల్ (Tea) పెట్టుకున్నాడు.. కేవలం రూ.5కే చక్కని రుచి గల టీ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.. తక్కువ లాభంతో ఎక్కువ టీలు అమ్ముతూ సంతోషంగా జీవిస్తున్నాడు.. ఉద్యోగం మానేసి ఎందుకీ పని అని అడిగిన వారికి తన పనితోనే సమాధానం చెప్పాడు.

రాజస్థాన్‌లోని (Rajasthan) అళ్వార్‌కు చెందిన మహేష్‌ 16 ఏళ్లుగా ధాన్యం మార్కెట్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. 1996లో మండిలో అకౌంటెంట్ ఉద్యోగం ప్రారంభించిన మహేష్‌కు కేవలం రూ.14 వేలు మాత్రమే జీతంగా వచ్చేవి. ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీంతో 45 ఏళ్ల వయసులో మహేష్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగం మానేసి టీ స్టాల్ ప్రారంభిచాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో బంధువులు, స్నేహితులు అతడి నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయినా మహేష్ ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అళ్వార్‌లో టీ రూ.10 ఉన్న దశలో అతడు కేవలం రూ.5కే అందించడం ప్రారంభించాడు.

Weird Laws: వామ్మో.. ఇవేం వింత చట్టాలు.. స్త్రీ, పురుషుల లోదుస్తులను కలిపి ఉతక్కూడదట.. భార్య బర్త్‌డేను మర్చిపోయిన భర్తకు శిక్ష ఏంటంటే..

మొదటి మూడు నెలలు ఇబ్బంది పడినా.. తక్కువ ధరకు మంచి రుచి కలిగిన టీ ఇస్తుండడంతో మహేష్ టీ స్టాల్‌కు గిరాకీ పెరిగింది. ధర తక్కువ అయినా ఎక్కువ టీలు అమ్ముడుపోతుండడంతో మహేష్‌కు రోజుకు రూ.1000 నుంచి 1200 వరకు మిగులుతోంది. మార్కెట్ వర్తకులు, కార్మికుల నుంచి సామాన్య జనం వరకు తన టీ తాగేందుకు ఇష్టపడుతున్నారని మహేష్ సంతోషంగా చెబుతున్నాడు.

పెళ్లి దుస్తుల్లో వెలిగిపోతున్న ఈ వరుడు.. కొద్ది గంటలకే పోలీస్ వ్యాన్‌లో ప్రత్యక్ష్యం.. ఇంతకీ ఈ పెళ్లికొడుకు చేసిన నిర్వాకమేంటంటే..

Updated Date - 2023-03-17T19:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising